నకిలీ కోవిడ్ డెత్ సర్టిఫికెట్లు.. ఆందోళన వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు..

Published : Mar 08, 2022, 11:00 AM IST
నకిలీ కోవిడ్ డెత్ సర్టిఫికెట్లు.. ఆందోళన వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు..

సారాంశం

నకిలీ కోవిడ్ డెత్ సర్టిఫికెట్ల మీద సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. నష్టపరిహారం కోసం డాక్టర్లే ఇలా నకిలీ సర్టిఫికెట్లు ఇవ్వడం మీద ఆరోపణలు వెల్లువెత్తడంతో దీనిమీద దర్యాప్తుకు ఆదేశించింది. 

నకిలీ కోవిడ్ డెత్ సర్టిఫికెట్ల మీద సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. నష్టపరిహారం కోసం డాక్టర్లే ఇలా నకిలీ సర్టిఫికెట్లు ఇవ్వడం మీద ఆరోపణలు వెల్లువెత్తడంతో దీనిమీద దర్యాప్తుకు ఆదేశించింది. 

న్యూఢిల్లీ : దేశంలో కొందరు డాక్టర్లు Fake covid-19 Death Certificates జారీ చేస్తుండడం పట్ల Supreme Court ఆందోళన వ్యక్తం చేసింది. corona virus కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ఇస్తున్న నష్ట పరిహారాన్ని కాజేయడానికి నకిలీ డెత్ సర్టిఫికెట్లు పుట్టుకొస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంలో దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందని జస్టిస్ ఎం.ఆర్.షా, జస్టిస్ బి.వి. నాగరత్నతో కూడిన ధర్మాసనం పేర్కోంది. 

నష్టపరిహారం కోరుతూ వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి నిర్థిష్ట కాల వ్యవధి ఉండాలని సూచించింది. ఏకంగా డాక్టర్లే నకిలీ మరణ ధృవీకరణ పత్రాలు ఇస్తుండడం తీవ్రమైన విషయమని ధర్మాసనం తెలిపింది. దీనివల్ల అసలైన vicitmsకు అన్యాయం జరుగుతుందని వెల్లడించింది. గౌరవ్ బన్సల్ తో పాటు మరికొందరు దాఖలు చేసిన పిటిషన్లపై ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది.

ఇదిలా ఉండగా, Telangana State Medical Council (టీఎస్‌ఎంసీ) డేటాబేస్ టాంపరింగ్ చేసి, అనర్హులను రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు జారీ చేసిన కేసు దర్యాప్తును సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ముమ్మరం చేశారు. ఈ కేసులో కౌన్సిల్ సీనియర్ అసిస్టెంట్ అనంత కుమార్ తో సహా ముగ్గురు నిందితులను గత గురువారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో మరో అనుమానితురాలిగా ఉన్న nagamani 2015లోనే అరెస్ట్ అయినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు.

విజయవాడకు భూక్యా నాగమణి, విజయనగరానికి చెందిన గంట రాంబాబు సన్నిహితులు. వీరిద్దరూ కలిసి 2015లో Duplicate MBBS Certificateతో పాటు ఏపీ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ పత్రాన్ని డీటీపీలో రూపొందించారు. గుంటూరు జిల్లా నిజాంపట్నంకు చెందిన చెన్ను నాగమణి 2012లో ఏపీ మెడికల్ కౌన్సిల్ లో రిజిస్టర్ చేయించుకున్నారు. ఈమెకు చెందిన 65699 నెంబర్ నే వినియోగించి వీరిద్దరూ  Fake Certificates రూపొందించారు. వీటి ఆధారంగా నాగమణి నగరానికి చెందిన రమేష్ ద్వారా అదిలాబాద్ జిల్లా చెన్నూరులో ఉన్నలక్ష్మీ నర్సింగ్ హోమ్ లో గైనకాలజిస్ట్ గా చేరారు.  

తన విద్యార్హత పత్రాల్లో ఎంబీబీఎస్, ఎమ్మెస్ (ఓబీజీ) అంటూ పొందుపరచడంతో ఆస్పత్రి యాజమాన్యం ఉద్యోగం ఇచ్చింది.   ఈమె వ్యవహార శైలి, రాస్తున్న మందులు చూసిన సదరు హాస్పిటల్  పరిపాలనాధిపతి సుభాష్ అనుమానించారు. తన సందేహం నివృత్తి చేయాల్సిందిగా కోరుతూ మెడికల్ కౌన్సిల్ కు లేఖ రాశారు. పూర్వాపరాలు పరిశీలించిన కౌన్సిల్ నాగమణి నకిలీ వైద్యురాలని తేల్చడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిందిగా సుభాష్ కు సూచించింది. దీంతో ఆయన చెన్నూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు  

ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నాగమణితో పాటు రాంబాబును 2015 ఆగస్టు 22న అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టు విచారణలో ఉంది. ఇంత వరకు బాగానే ఉన్నా ఈ కేసులో లోతుగా దర్యాప్తు చేయడంలో చెన్నూరు పోలీసులు విఫలమయ్యారు. నాగమణి,  రాంబాబు కలిసినకిలీ సర్టిఫికెట్ల తయారు చేశారని తేల్చారు. ఉమ్మడి రాష్ట్రంలోని ఏపీ మెడికల్ కౌన్సిల్ నిజాంపట్నంకు చెందిన నాగమణి రిజిస్టర్ చేసుకున్నారని, ఆమె రిజిస్ట్రేషన్ నెంబర్ 65699  అని వీరికి ఎలా తెలిసింది అనేది ఆరా తీయలేదు. ఇప్పుడు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?