కరోనాని జయించిన 10నెలల చిన్నారి

By telugu news team  |  First Published Apr 9, 2020, 9:03 AM IST

గత నెల తమిళనాడుకి చెందిన ఓ పది నెలల చిన్నారికి కరోనా సోకింది. దీంతో మార్చి 29న కోయంబత్తూరులోని ఈఎస్ఐ ఆస్పత్రిలో చేర్చారు. చిన్నారి తల్లి, నాయనమ్మ, వారి పనిమనిషి సైతం కరోనా బారిన పడ్డారు. ఎనిమిది రోజుల చికిత్స అనంతరం ఏప్రిల్‌ 6న శిశువును ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు.
 


ప్రపంచ దేశాలను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. మన దేశంలోనూ ఈ వైరస్ కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. రోజు రోజుకీ మరణాల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. ఇలాంటి సమయంలో.. ఓ మంచి వార్త వినపడింది. ఓ పది నెలల చిన్నారి కరోనాని జయించాడు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది.

Also Read 

Latest Videos

పూర్తి వివరాల్లోకి వెళితే... గత నెల తమిళనాడుకి చెందిన ఓ పది నెలల చిన్నారికి కరోనా సోకింది. దీంతో మార్చి 29న కోయంబత్తూరులోని ఈఎస్ఐ ఆస్పత్రిలో చేర్చారు. చిన్నారి తల్లి, నాయనమ్మ, వారి పనిమనిషి సైతం కరోనా బారిన పడ్డారు. ఎనిమిది రోజుల చికిత్స అనంతరం ఏప్రిల్‌ 6న శిశువును ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు.

దీంతోపాటు చిన్నారి తల్లి, నాయనమ్మ, పనిమనిషి కూడా డిశ్చార్జి చేశారు. రాష్ట్రంలో నమోదైన 45వ కరోనా బాధితుడు ఈ చిన్నారి. తల్లి ద్వారా బాలునికి కరోనా సోకింది. బాలుడు తల్లి ఈరోడ్‌ రైల్వే ఆస్పత్రిలో వైద్యురాలు. అక్కడి ఆస్పత్రికి చికిత్సకు వచ్చిన 26 ఏళ్ల రోగి ద్వారా బాలుడు తల్లికి కరోనా సోకింది. ఢిల్లీలో మర్కజ్‌కు వెళ్లివచ్చిన వారితో కలిసి ప్రయాణించడంతో ఆ వ్యక్తికి కరోనా సోకింది.

click me!