కొద్దిరోజుల్లో పెళ్లి.. తండ్రి మరణం: నాన్న మృతదేహం సాక్షిగా వివాహం

Siva Kodati |  
Published : Aug 11, 2019, 10:51 AM IST
కొద్దిరోజుల్లో పెళ్లి.. తండ్రి మరణం: నాన్న మృతదేహం సాక్షిగా వివాహం

సారాంశం

పెళ్లంటే వేదమంత్రాలు, భాజాభజంత్రీలు, అగ్నిసాక్షిగా జరుగుతుంది. కానీ ఓ వ్యక్తి మాత్రం తన తండ్రి మృతదేహం సాక్షిగా వివాహం చేసుకున్నాడు. 

పెళ్లంటే వేదమంత్రాలు, భాజాభజంత్రీలు, అగ్నిసాక్షిగా జరుగుతుంది. కానీ ఓ వ్యక్తి మాత్రం తన తండ్రి మృతదేహం సాక్షిగా వివాహం చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు రాష్ట్రం విల్లుపురం జిల్లా దిండివనం సమీపంలోని సింగనూర్ గ్రామానికి చెందిన దైవమణి కుమారుడు అలెగ్జాండర్.

అతను మయిలంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉద్యోగం చేస్తున్నాడు. అదే స్కూలులో పని చేస్తున్న గుణమంగళానికి చెందిన జగదీశ్వరితో ఏర్పడిన పరిచయం, ప్రేమగా మారింది. ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు.

ఈ విషయాన్ని ఇరు కుటుంబాల్లోనూ తెలియజేశారు. దీనికి అంగీకరించిన పెద్దలు సెప్టెంబర్ 2న వివాహానికి నిశ్చయించి పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో అనారోగ్యానికి గురైన అలెగ్జాండర్ తండ్రి దైవమణి మృతిచెందాడు.

నాన్న మరణంతో కృంగిపోయిన అలెగ్జాండర్ తన తండ్రి మృతదేహం ఎదుటే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకు ఇరువురి కుటుంబీకులు అంగీకరించడంతో జగదీశ్వరిని పెళ్లి చేసుకుని తండ్రి పట్ల తన ప్రేమను చూపించాడు. 

PREV
click me!

Recommended Stories

38 మందికి మరణ శిక్ష గుజరాత్ హై కోర్ట్ సంచలన తీర్పు | Historic Verdict in 2008 Ahmedabad Incident
ఇండోనేషియాలో ప్రంబనన్ ఆలయందర్శించిన మోదీ పవర్ ఫుల్ స్పీచ్ | PM Narendra Modi Prambanan Temple Visit