wall posters for bride: పెళ్లి కోసం.. యువ‌కుడి పాట్లు.. పెళ్లికూతురు కావాలంటూ ఊరంతా పోస్టర్లు..

By Rajesh KFirst Published Jun 27, 2022, 6:30 AM IST
Highlights

Tamil Nadu wall posters for bride: త‌మిళ‌నాడుకు  చెందిన ఓ యువ‌కుడు త‌నకు కావాల్సిన జీవిత భాగ‌స్వామి కోసం.. సంప్రదాయ పద్ధతుల్లో వెతికి విసిగిపోయాడు. దీంతో వినూత్న‌మార్గాన్ని ఎంచుకున్నాడు. పెళ్లికూతురు కావాలి’ అంటూ న‌గ‌ర‌మంత పోస్ట‌ర్ల‌ను అంటించాడు.

Tamil Nadu wall posters for bride: సాధారణంగా ఎన్నిక‌ల ప్ర‌చార స‌మ‌యంలో.. వాల్ పోస్ట‌ర్ల‌ను వేయ‌డం చూసి ఉంటాం.. లేదా కొత్త సినిమా విడుద‌ల స‌మ‌యంలో పోస్ట‌ర్ల‌ను అతికించ‌డం చూసి ఉంటాం.. అది కాదంటే.. చిన్నపిల్లలు తప్పిపోతేనో.. మతిస్థిమితం లేనివారు కనిపించకుండా పోతేనో వారి స‌రికి సంబంధించిన పోస్ట‌ర్ల‌ను గోడలపై చూస్తుంటాం.. కానీ.. త‌మిళ‌నాడులోని  మదురైలో వీధుల్లో ఓ విచిత్ర‌మైన పోస్ట‌ర్లు ద‌ర్శ‌నమిస్తున్నాయి. పెళ్లికూతురు కావాలి అనే పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. వీటిని ఎవరు అతికించారు. ఆ పోస్ట‌ర్ల వెనుక క‌థేంటో తెలుసుకుందాం.. 

వివరాల్లోకెళ్తే.. మధురైలోని విల్లుపురంలో నివసిస్తున్న జగన్ (27) యువ‌కుడు.. గత 4 సంవత్సరాలుగా త‌నకు కావాల్సిన జీవిత భాగ‌స్వామి కోసం వెతుకుతున్నాడు. ఈ క్ర‌మంలో నానా ప్ర‌య‌త్నాలు చేశాడు. కానీ.. అత‌నికి స‌రైన‌ వధువు ఆచూకీ మాత్రం లభించలేదు. దీంతో.. విసిగిపోయిన ఆ యువ‌కుడు.. త‌న కాబోయే భాగ‌స్వామిని వెతకడానికి నూత‌న‌ మార్గాన్ని ఎంచుకున్నాడు. అనుకున్న‌దే తాడువుగా.. జీవిత భాగస్వామి కావాలంటూ.. వాల్ పోస్ట‌ర్ల‌ను ముద్రించాడు. మ‌రుస‌టి రోజు.. నగరమంతటా అంటించాడు. ప్ర‌స్తుతం మదురై న‌గ‌ర‌ కూడళ్లలో ‘పెళ్లికూతురు కావాలి’ అంటూ పోస్టర్లు ద‌ర్శ‌మిస్తున్నాయి. 

ఈ పోస్టర్లలో జగన్ తనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇచ్చారు. ఆ పోస్టర్​లలో తన పేరు, కులం, వేతనం, వృత్తి, కాంటాక్ట్ నెంబర్, అడ్రస్ వివరాలన్నీ స్పష్టంగా ఉండేలా చూసుకున్నాడు.  తాను బీఎస్సీ ఐటీ చేశానని.. ప్ర‌స్తుతం వాల్ పోస్టర్మేనేజర్ గా కాకుండా.. పార్ట్​టైమ్ డిజైనర్​గా పనిచేస్తున్నట్లు, త‌న‌కు 40 వేల జీవితం వ‌స్తున్న‌ట్టు..  అలాగే..త‌న పేరిట ఓ చిన్న ఫ్లాట్ కూడా ఉందని అందులో పేర్కొన్నారు. అలాగే.. స్టైల్ గా  దిగిన ఓ ఫొటోను సైతం పోస్టర్​పై ముద్రించాడు. 

పెళ్లి సంబంధం కోసం నానా ప్ర‌య‌త్నాలు చేసాన‌నీ, ఈ క్రమంలో ప‌లు మాట్రిమోని ఏజెన్సీల్లో రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నాన‌ని, కానీ  దళారులు డబ్బులు దొచుకున్నారు. త‌ప్పా.. త‌న‌కు న‌చ్చిన అమ్మాయిని చూపెట్ట‌లేక‌పోయార‌ని తెలిపారు. దీంతో విసిగిపోయి.. పోస్టర్లను డిజైన్ చేసిన‌ట్టు తెలిపారు. తన పోస్టర్ చూసి ఎవరైనా తనపై ఆసక్తి చూపుతార‌ని, పెళ్లికి ముందుకు వ‌స్తార‌ని జగన్ భావిస్తున్నాడు. డిజైనర్​గా పనిచేస్తున్నప్పుడే ఇలాంటి వినూత్న ఆలోచన తనకు తట్టిందని తెలిపాడు. ఇప్పుడు ఈ పోస్ట‌ర్ కు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైర‌ల్ గా మారాయి. నీ ఐడియా సూప‌ర్ బ్రో అంటూ కామెంట్లు చేస్తున్నారు. 

click me!