తమిళనాడులో కొనసాగుతున్న Jallikattu పోటీలు.. 48 మందికి గాయాలు..

By Sumanth KanukulaFirst Published Jan 14, 2022, 3:40 PM IST
Highlights

తమిళనాడులో (Tamil Nadu) జల్లికట్టు సందడి మొదలైంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో యువకులు ఈ సంప్రదాయ క్రీడలో ఉత్సహంతో పోటీపడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా నిబంధనలు పాటిస్తూ జల్లికట్టు (Jallikattu) నిర్వహణకు స్టాలిన్ ప్రభుత్వం అనుమతించిన సంగతి తెలిసిందే.

తమిళనాడులో (Tamil Nadu) జల్లికట్టు సందడి మొదలైంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో యువకులు ఈ సంప్రదాయ క్రీడలో ఉత్సహంతో పోటీపడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో  కరోనా నిబంధనలు పాటిస్తూ జల్లికట్టు నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిన సంగతి తెలిసిందే. గురువారం రోజున పుదుకోట్టై జిల్లాలోని తచ్చంకురిచ్చిలో Jallikattuపోటీలను ప్రారంభించారు. ఈ పోటీల్లో భాగంగా దాదాపు 600 ఎద్దులను వడివాసల్ (ప్రవేశ మార్గం) గుండా వదిలారు. 300 మంది యువకులు ఎద్దులను అదుపు చేయడానికి పోటీ పడ్డారు. అయితే కరోనా నేపథ్యంలో కోవిడ్ రెండు డోసులు వేయించుకున్నట్టుగా సర్టిఫికేట్ చూపించినవారికే పోటీల్లో పాల్గొనడానికి అవకాశం కల్పిస్తున్నారు. 

అయితే జల్లికట్టు పోటీలను నిర్ణీత సమయం కన్నా గంట సేపు అధికంగా నిర్వహించడంతో.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన ఎద్దుల యజమానులు వాడివాసల్ నుంచి ఎద్దులను ఇష్టానుసారంగా బయటకు వదిలారు. దీంతో ఎద్దులు రంకెలేస్తూ జనం వైపు దూసుకెళ్లాయి. దీంతో ఒకరిద్దరు పోలీసులు కూడా గాయపడ్డారు. దీంతో పోలీసులు అక్కడ లాఠీచార్జ్ చేయడంతో కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. 

శుక్రవారం ఉదయం మదురై అవనీయపురంలో జల్లికట్టు పోటీలు ప్రారంభం అయ్యాయి. పోట్లగిత్తల్ని లొంగదీసుకునేందుకు కుర్రాళ్లు పోటీ పడుతున్నారు. ఇక్కడ పోటీల్లో 500 ఎద్దులు బరిలో నిలవగా.. 300 మంది యువకులు ఎద్దులను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. పోటీలను వీక్షించేందకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తున్నారు. అయితే ఈ పోటీల్లో భాగంగా 48 మంది గాయాలు అయినట్టుగా ఓ వైద్యాధికారి తెలిపినట్టుగా ఏఎన్‌ఐ న్యూస్ ఏజెన్సీ పేర్కొంంది.

తమిళనాడు  కరోనా విజృంభన కొనసాగుతున్న నేపథ్యంలో జల్లికట్టు పోటీలపై పలు ఆంక్షలు విధించారు. కొవిడ్‌  మార్గదర్శకాలను తప్పకుండా అనుసరించాలని సీఎం స్టాలిన్ పేర్కొన్నారు. పోటీల్లో పాల్గోనేందుకు కేవలం 300 మందికి మాత్రమే అనుమతి ఉంటుందని, పోటీలను చూసేందుకు 150 మంది ప్రేక్షకులు లేదా 50 శాతం సిట్టింగ్ సామర్థ్యానికి మించకుడాదని తమిళనాడు సర్కార్ సూచించింది. పోటీలకు ప్రారంభానికి 48 గంటల ముందు కొవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్ ఉంటేనే తీసుకోవాలిని ఆదేశాలు జారి చేసింది.

click me!