బాలికపై తండ్రీతాతల అత్యాచారం: అబార్షన్ కు కోర్టు అనుమతి

By telugu teamFirst Published Jul 23, 2020, 10:47 AM IST
Highlights

తండ్రీతాతల చేతుల్లో నెలల తరబడి అత్యాచారానికి గురైన బాలిక గర్భం దాల్చింది. దీంతో అబార్షన్ కు అనుమతి ఇవ్వాలంటూ తల్లి తరఫు బందువు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

మధురై: బాలిక క్షేమాన్ని కాంక్షించి గర్భస్రావానికి కోర్టు అనుమతి ఇచ్చింది. తాత, తండ్రి అత్యాచారం చేయడంతో 15 బాలిక గర్భం దాల్చింది. ఈ సంఘటన తమిళనాడులోని తంజావూరు జిల్లాలో చోటు చేసుకుంది. ఆమె గర్భస్రావానికి అనుమతి ఇస్తూ మద్రాసు హైకోర్టు అనుమతి ఇచ్చింది. 

తండ్రీతాత చేతిలో అఘాయిత్యానికి గురైన బాలిక తరఫున ఆమె తల్లి సోదరి పిటిషన్ దాఖలు చేసింది. బాలిక తల్లి మరణించిందని, బాలికపై తండ్రీతాత అత్యాచారానికి పాల్పడిందని చెబుతూ గర్భస్రావానికి అనుమతి ఇవ్వాలని ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు అందుకు అనుమతి ఇచ్చింది.

బాలిక నాలుగేళ్ల వయస్సులో ఉన్నప్పుడు తల్లి మరణించింది. బాలిక తండ్రికి ఇద్దరు కూతుళ్లు. అతను వ్యవసాయ కూలీగా పనిచేస్తుంటాడు. భార్య మరణించిన తర్వాత కూతుళ్లను అతనే చూసుకుంటున్నాడు. బాధిత బాలిక చెల్లె తల్లి తరఫు తాతకు తాము వస్తామని చెప్పింది. దాంతో ఆమెను వాళ్లు తీసుకొచ్చుకున్నారు. 

గత నెల రోజులుగా బాలిక అమ్మమ్మతో ఉంటోంది. ఇంతలో తనకు కడుపు నొప్పి వస్తోందని బాలిక చెప్పింది. దాతో ఆమె ఒరత్తనాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకుని వెళ్లారు. బాలిక గర్భం దాల్చిందని పరీక్షల అనంతరం వైద్యులు తేల్చారు.

బాలికను విచారించగా తనపై జరిగిన అత్యాచారం గురించి చెప్పింది. తాగి వచ్చి తనపై తండ్రి అఘాయిత్యానికి పాల్పడుతూ వచ్చాడు. దాదాపు ఐదు నెలల పాటు అలా చేశాడని చెప్పింది. తాత కూడా అదే పనిచేశాడని చెప్పింది.

దాంతో వల్లం ఆల్ వుమెన్ పోలీసులకు తల్లి తరపు బంధువులు ఫిర్యాదు చేశారు. జులై 2వ తేదీన పోలీసులు కేసు నమోదు చేశారు. వారిని అరెస్టు చేసి తిరుచి జైలుకు పంపించారు 

click me!