రాజస్థాన్‌లో దారుణం: వివాహితతో సంబంధం, వ్యక్తిని కొట్టి చంపారు

Published : Oct 10, 2021, 11:20 AM IST
రాజస్థాన్‌లో దారుణం: వివాహితతో సంబంధం, వ్యక్తిని కొట్టి చంపారు

సారాంశం

రాజస్థాన్ రాష్ట్రంలో ఓ వివాహితతో సంబంధం ఉందనె నెపంతో ఆరుగురు ఓ వ్యక్తిని చితకబాదారు.ఈ ఘటనలో జగదీష్ మరణించారు. కర్రలతో జగదీష్ ను కొడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.  


జైపూర్: రాజస్థాన్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకొంది. వివాహితతో  సంబంధం పెట్టుకొన్నాడనే నెపంతో ఆరుగురు వ్యక్తులు ఒకరిని చితకబాదారు.ఈ దెబ్బలకు తాళలేక ఆ వ్యక్తి మరణించినట్టుగా పోలీసులు చెప్పారు. Rajasthan రాష్ట్రంలోని Hanumangarh  జిల్లాలో గురువారం నాడు ఈ ఘటన చోటు చేసుకొంది.

ఓ వ్యక్తిని ఆరుగురు వ్యక్తులు కర్రలతో కొడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..తన కొడుకును ప్రేంపురాకు చెందిన వినోద్, ముఖేష్, లాల్‌చంద్ అలియాస్ రామేశ్వర్, సికందర్, దిలీప్,రాజ్‌పుత్ లు తీవ్రంగా కొట్టి తమ ఇంటి ముందు తీసుకొచ్చి వేశారని మృతుడి తండ్రి Banwarilal Meghwal చెప్పారు. తాను నిందితులను పట్టుకొనే ప్రయత్నించి విపలమైనట్టుగా భన్వారీలాల్ చెప్పారు. తన Jagdish Meghwal చనిపోయిన తర్వాతే నిందితులు తీసుకొచ్చి ఇంటి ముందు వదిలివెళ్లారని ఆయన కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ విషయమై నిందితులపై జగదీష్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

ఈ ఫిర్యాదు ఆధారంగా 11 మందిపై కేసు నమోదు చేసినట్టుగా పోలీసులు తెలిపారు. ఇందులో ముగ్గురిని అరెస్ట్ చేశామన్నారు పోలీసులు.గురువారం నాడు మధ్యాహ్నం తన కొడుకు జగదీష్ Suratgarh. వెళ్తానని చెప్పి ఇంటి నుండి వెళ్లిపోయాడని తండ్రి భన్వారీలాల్ చెప్పారు.ఈ సమయంలోనే నిందితులు తన కొడుకును కిడ్నాప్ చేసి కొట్టి చంపారని జగదీష్ తండ్రి ఆరోపించారు.

జగదీష్  అదే గ్రామానికి చెందిన ఓ వివాహితతో సంబంధం కలిగి ఉన్నాడని ఆరోపిస్తూ వివాహిత భర్తతో పాటు మరో ఐదుగురు తీవ్రంగా దాడి చేశారు. ఈ దాడిలో జగదీష్ మరణించాడు.నిందితులను అరెస్ట్ చేసే వరకు తాము జగదీష్ అంత్యక్రియలు నిర్వహించబోమని స్థానికులు పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు.ఈ ఘటనలో పాల్గొన్న నిందితుల కోసం  పోలీసులు  గాలింపు చర్యలు చేపట్టారు.

PREV
click me!

Recommended Stories

8th Pay Commission : మినిమం శాలరీనే రూ.18,000 నుండి రూ.51,000 పెంపు.. ఈ స్థాయిలో జీతాలు పెరుగుతాయా..?
Devta Chhatrakhand Panchveer: హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలో న్యూ ఇయర్ వేడుకలు| Asianet News Telugu