తమిళనాడు బీజేపీ కార్యదర్శి సూర్య అరెస్ట్.. అరెస్ట్‌లు తమను అడ్డుకోలేవన్న అన్నామలై..

Published : Jun 17, 2023, 09:47 AM ISTUpdated : Jun 17, 2023, 09:48 AM IST
తమిళనాడు బీజేపీ కార్యదర్శి సూర్య అరెస్ట్.. అరెస్ట్‌లు తమను అడ్డుకోలేవన్న అన్నామలై..

సారాంశం

తమిళనాడు బీజేపీ కార్యదర్శి ఎస్‌జీ సూర్యను మధురై జిల్లా సైబర్ క్రైమ్ పోలీసులు నిన్న రాత్రి చెన్నైలో అరెస్ట్ చేశారు. మదురై ఎంపీ వెంకటేశన్‌పై ఇటీవల చేసిన ట్వీట్‌కు సంబంధించి ఆయనను అరెస్టు చేసినట్టుగా  పోలీసులు వెల్లడించారు.  

తమిళనాడు బీజేపీ కార్యదర్శి ఎస్‌జీ సూర్యను మధురై జిల్లా సైబర్ క్రైమ్ పోలీసులు నిన్న రాత్రి చెన్నైలో అరెస్ట్ చేశారు. మదురై ఎంపీ వెంకటేశన్‌పై ఇటీవల చేసిన ట్వీట్‌కు సంబంధించి ఆయనను అరెస్టు చేసినట్టుగా  పోలీసులు వెల్లడించారు.  ఎస్‌జీ సూర్యపై ఐపీసీ 153(ఏ), 505 (1)(బీ), 505 (1)(సీ) సెక్షన్లు, 66(డీ) ఐటీ చట్టం కింద అభియోగాలు మోపారు. ప్రస్తుతం ఆయన రిమాండ్ కోరుతూ మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరచనున్నారు. 

అయితే తమిళనాడు పోలీసుల చర్యను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై తీవ్రంగా ఖండించారు. డీఎంకే మిత్రపక్షాలైన కమ్యూనిస్టుల దుష్ట ద్వంద్వ ప్రమాణాలను బట్టబయలు చేయడమే ఎస్‌జీ సూర్య చేసిన ఏకైక తప్పు అని అన్నారు. వాక్ స్వాతంత్య్రాన్ని తగ్గించడానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించడం, చిన్న విమర్శల కోసం గందరగోళం చెందడం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నాయకుడికి తగదని అన్నామలై పేర్కొన్నారు. ఇది నిరంకుశ నాయకుడి తయారీకి సంకేతాలు అని డీఎంకే ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. నిరంకుశ నాయకుల నుండి ప్రేరణ పొందిన సీఎం  ఎంకే స్టాలిన్.. రాష్ట్రాన్ని చట్టాలు లేని అడవిగా మారుస్తున్నారని ఆరోపించారు. ఈ అరెస్టులు తమను అడ్డుకోలేవని.. తాము సత్యాన్ని మోసేవారిగా కొనసాగుతామని పేర్కొన్నారు. 

 

 

ఇదిలా ఉంటే.. మ‌నీ లాండరింగ్ కేసుకు సంబంధించి డీఎంకే నేత, తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీని ఈడీ ఇటీవల అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయనకు కోర్టు ఈనెల 28 వ‌ర‌కూ జ్యుడిషియ‌ల్ క‌స్ట‌డీ విధించింది. అయితే ఈ చర్యను తమిళనాడులో అధికార డీఎంకే తీవ్రంగా ఖండించింది. ఈ పరిణామాలతో తమిళనాట రాజకీయాలు వేడెక్కాయి. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో పోస్టుకు సంబంధించి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌జీ సూర్యను రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Special Trains for Sankranti Festival: సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక రైళ్లు| Asianet News Telugu
Real estate: నెల రోజుల్లో రూ. 20 ల‌క్ష‌ల లాభం.. అక్క‌డ రియ‌ల్ ఎస్టేట్ అంతలా ఎందుకు పెరుగుతోంది.?