మాజీ ఎమ్మెల్యేపై నిప్పులు చెరిగి.. నోరుజారిన ఖుష్బూ.. !

Published : Mar 31, 2021, 11:09 AM IST
మాజీ ఎమ్మెల్యేపై నిప్పులు చెరిగి.. నోరుజారిన ఖుష్బూ.. !

సారాంశం

బీజేపీ నేత ఖుష్బూ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. తమిళనాడు ఎన్నికల బరిలో ఆమె చేసిన వ్యాఖ్యలు అందర్నీ నవ్వుకునేలా చేశాయి.  నోరు జారిన విషయం ఆలస్యంగా గ్రహించి, నాలిక కరుచుకున్నా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

విషయం ఏంటంటే.. నటి ఖుష్బూ బీజేపీ తరఫున అభ్యర్థిగా తమిళనాడులోని థౌజెండ్ లైట్స్ నియోజకవర్గంలో పోటీలో ఉన్నారన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో ముమ్మర ప్రచారం చేస్తున్నారు. 

ఈ క్రమంలో ఇటీవల ఓ ప్రచారసభలో మాట్లాడుతూ... థౌజెండ్ లైట్స్ నియోజకవర్గంలో చాలా సమస్యలున్నాయని, గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ప్రజా సమస్యలను గాలికొదిలేశాడని మండిపడ్డారు. 

ఆమె ఇలా మాట్లాడుతుంటే.. పక్కనే ఉన్న ఓ నేత కాస్త ఇబ్బందిగా కదిలాడు. కానీ ఖుష్బూ ఇవేమీ పట్టించుకోకుండా ఆ మాజీ ఎమ్మెల్యే మీద నిప్పులు చెరిగారు. ఆమె ప్రసంగం మొత్తం అయ్యాక ఓ నేత ఆమె దగ్గరికి వచ్చి... ‘మేడం ఆ మాజీ ఎమ్మెల్యే సెల్వం.. మీ పక్కనున్నది ఆయనే’ అని చెవిలో గుసగుసగా చెప్పాడు. దీంతో ఖుష్బూకు ఏం చేయాలో పాలుపోలేదు. 

కానీ అప్పటికే జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. కార్యకర్తలంతా ఆమె అజ్ఞానానికి పెద్ద పెట్టున నవ్వుతూ కేకలు పెట్టారు. దీంతో ఖుష్బూ కూడా కాస్త ఇబ్బంది పడ్డారు. సెల్వం గతంలో డీఎంకే తరఫున థౌజెండ్ లైట్స్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇటీవలే ఆయన బీజేపీలో చేరారు. 
 
PREV
click me!

Recommended Stories

అరెస్ట్ అయిన కొన్ని గంటల్లోనే Udayanidhi Stalin విడుదల | Udhayanidhi Stalin Released Within Hours
Udhayanidhi Stalin Speech Controversy: తమిళ రాజకీయాల్లో డబుల్ మీనింగ్ డైలాగ్ ల రచ్చ | Asianet Telugu