తమిళనాడులో బీజేపీకి షాక్.. ఐటీ విభాగానికి చెందిన 13 మంది పార్టీకి రాజీనామా..

Published : Mar 08, 2023, 03:27 PM IST
తమిళనాడులో బీజేపీకి షాక్.. ఐటీ విభాగానికి చెందిన 13 మంది పార్టీకి రాజీనామా..

సారాంశం

తమిళనాడు బీజేపీకి షాక్ తగిలింది. చెన్నై వెస్ట్‌లోని బీజేపీ ఐటీ విభాగానికి చెందిన 13 మంది నేతలు పార్టీకి రాజీనామా చేశారు. 

తమిళనాడు బీజేపీకి షాక్ తగిలింది. చెన్నై వెస్ట్‌లోని బీజేపీ ఐటీ విభాగానికి చెందిన 13 మంది నేతలు పార్టీకి రాజీనామా చేశారు. అందులో బీజేపీ ఐటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు అన్బరసన్ కూడా ఉన్నారు. పార్టీలో నెలకొన్నా అసాధారణ పరిస్థితుల కారణంగానే రాజీనామా చేస్తున్నట్టుగా అన్బరసన్ వెల్లడించారు. అన్బరసన్‌ మాట్లాడుతూ.. ‘‘నేను బీజేపీ కోసం ఏళ్ల తరబడి పనిచేశాను. ఏ పదవి ఆశించలేదని ప్రజలకు తెలుసు. గత కొద్ది రోజులుగా పార్టీలో నెలకొన్న అసాధారణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నా’’ అని తెలిపారు. ఇక, ఈ రాజీనామా స్టేట్‌మెంట్‌లో 10 మంది బీజేపీ ఐటీ వింగ్ జిల్లా కార్యదర్శులు, ఇద్దరు 2 ఐటీ వింగ్ జిల్లా డిప్యూటీ సెక్రటరీల సంతకాలు చేశారు. 

ఇదిలా ఉంటే.. రెండు రోజుల క్రితం బీజేపీ తమిళనాడు ఐటీ వింగ్ చీఫ్‌గా ఉన్న సీటీఆర్ నిర్మల్ కుమార్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆ సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె అన్నామలైపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. నిర్మల్ కుమార్ తన రాజీనామాను ప్రకటిస్తూ ట్విట్టర్‌లో ఒక లేఖను పోస్ట్ చేశారు. బీజేపీ నాయకత్వం తన సొంత కార్యకర్తల ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తోందని ఆరోపించారు. ‘‘నేను గత 1.5 సంవత్సరాలుగా నేను పార్టీ కోసం పనిచేశాను. నేను నిజాయితీగా, కష్టపడి పనిచేశాను. కానీ బాధతో మాత్రమే మిగిలిపోయాను’’ అని నిర్మల్ కుమార్ పేర్కొన్నారు.

తాను ఎందుకు వైదొలగాలని నిర్ణయించుకున్నానో క్యాడర్‌కు తెలియజేయడం తన బాధ్యత అని పేర్కొన్న నిర్మల్ కుమార్.. తన నిర్ణయానికి అన్నామలైని నిందించారు. సొంత పార్టీ వాళ్లపై నిఘా పెట్టి ఆనందం పొందుతున్నారని ఆరోపించారు. అన్నామలైను ‘‘420మలై’’ అని విమర్శించారు. ఇక, నిర్మల్ కుమార్ బీజేపీకి తన రాజీనామాను ప్రకటించిన కొద్ది గంటలకే.. అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె పళనిస్వామి సమక్షంలో ఆ పార్టీలో చేరారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu