ఈ భాష దైవ భాష.. దేశవ్యాప్తంగా అన్ని ఆలయాల్లో ఉపయోగించాలి: హైకోర్టు

By telugu teamFirst Published Sep 13, 2021, 6:05 PM IST
Highlights

మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. తమిళం దైవ భాష అని స్పష్టం చేసింది. అంతేకాదు, దేశవ్యాప్తంగా అన్ని ఆలయాల్లో ఈ భాషను వినియోగించాలని తెలిపింది. 
 

చెన్నై: మద్రాస్ హైకోర్టు సంచలన ఆదేశాలు వెలువరించింది. తమిళం దైవ భాష అని పేర్కొంది. దేశవ్యాప్తంగా అన్ని ఆలయాల్లో అభిషేకాలు, సమర్పణల్లో ఈ భాషలోని శ్లోకాలను పఠించాలని ఆదేశించింది. అళ్వార్లు, నయనార్లు రాసిన పాదాలను జపించాలని తెలిపింది. న్యాయమూర్తులు ఎన్ కిరుబాకరన్, బీ పుగలేందిల ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది.

మనదేశంలో కేవలం సంస్కృతమే దైవ భాషగా నమ్మించారని ధర్మాసనం పేర్కొంది. ప్రాచీన సాహిత్యమంతా బోలెడు ఈ భాషలో నిక్షిప్తమైన విషయం వాస్తవమేనని తెలిపింది. దీనితో సంస్కృతంలోనే వేదాలు పఠిస్తే దేవుడు ఆలకిస్తాడన్న నమ్మకం ఏర్పడిందని వివరించింది. కానీ, తమిళం కూడా ప్రపంచంలోనే అతిప్రాచీన భాషల్లో ఒకటని పేర్కొంది. అంతేకాదు, తమిళాన్నీ దైవ భాషగా పేర్కొంటారని తెలిపింది.

మల్లిఖార్జునుడు తాండవమాడుతున్నప్పుడు ఢమరుకం వాయింపుల చప్పుళ్ల నుంచి తమిళం పుట్టినట్టు కొందరు విశ్వసిస్తారని ధర్మాసనం తెలిపింది. అంతేకాదు, మరికొన్ని ప్రాచీన సాహిత్యాలు తమిళ భాషను స్వయంగా మురుగేశుడే సృష్టించాడని పేర్కొంటున్నాయని వివరించింది. దేవుడితో అనుసంధానంలో ఉన్న ఈ భాషను దైవ భాషగా పేర్కొనడం సముచితమేనని పేర్కొంది. అలాంటి దైవ భాష తమిళాన్ని ఆలయాల్లో వినియోగించాలని సూచించింది.

click me!