దారుణం : భార్య వేరే వ్యక్తితో మాట్లాడిందని... నడిరోడ్డుపై చావచితగ్గొట్టిన భర్త...వీడియో వైరల్...

Published : Sep 13, 2021, 04:57 PM IST
దారుణం : భార్య వేరే వ్యక్తితో మాట్లాడిందని... నడిరోడ్డుపై చావచితగ్గొట్టిన భర్త...వీడియో వైరల్...

సారాంశం

ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మధ్యప్రదేశ్లోని అలీరాజ్ పూర్ జిల్లాలో శుక్రవారం నాడు జరిగిన ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

మధ్య ప్రదేశ్ : వీధిలో నడుచుకుంటూ వెళుతున్న అతడికి కొంత దూరంలో భార్య కనిపించింది. ఎవరో యువకుడితో మాట్లాడుతోంది. అంతే.. అతనిలో కోపం కట్టలు తెంచుకుంది. వెంటనే తన తల్లిదండ్రులను,  స్నేహితులను  పిలిపించి నడివీధిలోనే భార్యను చావ చితకొట్టాడు. ఈ క్రమంలో ఆమె దుస్తులు కూడా చిరిగిపోయాయి. ఆమె జాకెట్ స్థానభ్రంశమైనా అతడు లెక్కపెట్టకుండా ఆమెను చావాబాదాడు.

ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మధ్యప్రదేశ్లోని అలీరాజ్ పూర్ జిల్లాలో శుక్రవారం నాడు జరిగిన ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

భర్తకు మహిళపై అప్పటికే అనుమానం ఉన్నట్టు సమాచారం. దీంతో వీధిలో పరాయి పురుషుడితో  భార్య మాట్లాడుతూ కనిపించడంతో అతడు రెచ్చిపోయాడు. వెంటనే తన తల్లిదండ్రులను, ఇద్దరు స్నేహితులను రప్పించాడు.  ఆ తర్వాత ఆమెపై దాడి చేశాడు.  తండ్రి, స్నేహితులతో కలిసి భార్యను చావబాదాడు.  ఆమె దుస్తులు చిరిగిపోయినా  అతడు లెక్కచేయలేదు.

సాటి మహిళ అయి ఉండి కూడా అత్త.. తన కుమారుడిని కోడలిపై మరింత ఉసి గొలిపింది.  భార్యతో పాటు ఉన్న యువకుడిని కూడా.. భర్త, అతని స్నేహితులు కొట్టారు.  ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో విషయం పోలీసులకు చేరింది.

వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించి భర్తతోపాటు అతడికి సహకరించి వారందరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, అక్షరాస్యత పెంచడం ద్వారా మారుమూల ప్రాంతాల్లో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సామాజిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు.  తమ హక్కుల పట్ల మహిళల్లో అవగాహన కల్పించాలని వారు అభిప్రాయపడుతున్నారు.
 

PREV
click me!

Recommended Stories

Vijay Meets Governor Arlekar: ప్రభుత్వ ఏర్పాటుకు మూడోసారి గవర్నర్ ను కలిసిన విజయ్| Asianet Telugu
CPI-CPM Joint Press Conference: విజయ్ కు వామపక్షాల మద్దతుసీఎం కుర్చీ ఎక్కనున్న తలపతి| Asianet Telugu