శరత్‌కుమార్, రాధికలకు జైలు శిక్ష: కోర్టు సంచలన తీర్పు

Published : Apr 07, 2021, 01:28 PM ISTUpdated : Apr 07, 2021, 01:44 PM IST
శరత్‌కుమార్, రాధికలకు జైలు శిక్ష: కోర్టు సంచలన తీర్పు

సారాంశం

తమిళ సినీ నటుడు శరత్ కుమార్, నటి రాధికకు  కోర్టు జైలు శిక్ష విధిస్తూ బుధవారం నాడు తీర్పు వెలువరించింది.

చెన్నై: తమిళ సినీ నటుడు శరత్ కుమార్, నటి రాధికకు  కోర్టు జైలు శిక్ష విధిస్తూ బుధవారం నాడు తీర్పు వెలువరించింది.2014 లో మ్యాజిక్ ప్రేమ్స్ సంస్థ ఓ సినిమాను నిర్మించాలని ప్లాన్ చేసింది. ఈ సినిమాకు మ్యాజిక్ అని పేరు పెట్టారు. ఈ సినిమాలో  విక్రమ్ ప్రభు, కీర్తి సురేష్ లను నటీనటులుగా  తీసుకోవాలని నిర్ణయం తీసుకొన్నారు.

ఈ సినిమా నిర్మాణం కోసం రూ. 1.5 కోట్లను రేడియంట్ మీడియా సంస్థ నుండి  అప్పుగా తీసుకొన్నారు.2015 మార్చి మాసంలో ఈ అప్పును తిరిగి ఇస్తామని రేడియంట్ సంస్థతో అగ్రిమెంట్ చేసుకంది. ఈ సినిమా విడుదల తర్వాత ఈ డబ్బులు చెల్లిస్తామని ఒప్పందంలో పేర్కొన్నట్టుగా ఆ సంస్థ చెబుతోంది. కానీ డబ్బులు తీసుకొన్న సంస్థకు మ్యాజిక్ ఫ్రేమ్ సంస్థ డబ్బులు చెల్లించలేదు.

ఈ డబ్బుతో స్నేక్ షర్ట్ పేరుతో మరో సినిమాను నిర్మించారు. మరోవైపు రేడియంట్ సంస్థకు మ్యాజిక్ ఫ్రేమ్ సంస్థ ఇచ్చిన చెక్ బౌన్స్ అయిందని కోర్టులో చెక్ బౌన్స్ కేసు నమోదైంది.మొత్తం ఏడు కేసులు నమోదు కాగా, రాధిక,స్టీఫెన్ లను కౌంటర్ పిటిషనర్లుగా రెండు కేసుల్లో చేర్చారు. అయితే వడ్డీ ఎక్కువగా ఉన్నందున డబ్బును వెంటనే తిరిగి చెల్లించలేమని మ్యాజిక్ ఫ్రేమ్ సంస్థ వాదించింది. 

ఈ కేసులో కోర్టు బుధవారం నాడు తీర్పు వెల్లడించింది.  ఏడు కేసుల్లో  శరత్ కుమార్ తో పాటు ఆయన భార్య రాధికకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది.మ్యాజిక్ ఫ్రేమ్స్ సంస్థలో శరత్ కుమార్, రాధికలు భాగస్వామ్యులుగా ఉన్నారు.

PREV
click me!

Recommended Stories

TTV Dhinakaran Meets Governor: మా MLA లను విజయ్ కొంటున్నాడుగవర్నర్ కు AMMK ఫిర్యాదు | Asianet Telugu
Vijay Meets Governor Arlekar: ప్రభుత్వ ఏర్పాటుకు మూడోసారి గవర్నర్ ను కలిసిన విజయ్| Asianet Telugu