స్మశానంలోకి రానివ్వని వారసులు.. రోడ్డుమీదే మృతదేహం..

By AN TeluguFirst Published Apr 7, 2021, 11:19 AM IST
Highlights

కర్ణాటకలోని దళితుడి అంత్యక్రియలకు ఆటంకం కలగడంతో రోడ్డుమీదే మృతదేహాన్ని ఉంచిన ఘటన కలకలం రేపింది. స్మశానంలోకి వెళ్లకుండా అడ్డుకోవడంతో బంధువులు మృతదేహాన్ని రోడ్డుపై నుంచి ఆందోళనకు దిగారు.

కర్ణాటకలోని దళితుడి అంత్యక్రియలకు ఆటంకం కలగడంతో రోడ్డుమీదే మృతదేహాన్ని ఉంచిన ఘటన కలకలం రేపింది. స్మశానంలోకి వెళ్లకుండా అడ్డుకోవడంతో బంధువులు మృతదేహాన్ని రోడ్డుపై నుంచి ఆందోళనకు దిగారు.

కర్ణాటకలోని చెన్నపట్టణం తాలూకా హనుమాపురదొడ్డి గ్రామానికి చెందిన నాథయ్య(75) అనే దళితుడు అనారోగ్యంతో మృతిచెందాడు. గ్రామ శివారులోని స్మశానంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు వెళ్లగా కొందరు అడ్డుకున్నారు. దీంతో దళితుడి శవం ఉన్న వాహనాన్నిరోడ్డుపైనే నిలిపి ఆందోళన చేపట్టారు.

 ఈ సందర్భంగా దళితుల కోసం  శ్మశానం భూమి కేటాయించాలని డిమాండ్ చేశారు. అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి శవ సంస్కారానికి వేరే చోటు అవకాశం కల్పించారు.

శ్మశానానికి 60 ఏళ్ల క్రితం గ్రామ పెద్ద స్థలం దానం చేశారని,  ఆ భూమి తమకు కావాలని వారసులు న్యాయ పోరాటం ప్రారంభించడం వల్ల శ్మశానంలో శవ సంస్కారానికి వారు అనుమతించడంలేదని అధికారులు పేర్కొన్నారు.
 
click me!