కుల గణన వెంటనే చేపట్టాలని కోరుతూ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. సామాజిక న్యాయం, సాధికారత కార్యక్రమాల కోసం అది అవసరం అని చెప్పారు.
కుల గణనను వేగవంతం చేయాలని కోరుతూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. అర్థవంతమైన సామాజిక న్యాయం, సాధికారత కార్యక్రమాల కోసం తాజా కుల గణన అవసరం అని తెలిపారు. ప్రస్తుతం ముఖ్యంగా ఒబీసీలకు చాలా అవసరమైన విశ్వసనీయ డేటాబేస్ అసంపూర్తిగా ఉందని ఖర్గే తన లేఖలో పేర్కొన్నారు.
95 శాతం మంది భారతీయులకు జాతీయ జెండాపై అవగాహన లేదు - ఫ్లాగ్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా సీఈవో అషిమ్ కోహ్లీ..
‘‘తాజా కుల గణన కోసం భారత జాతీయ కాంగ్రెస్ చేసిన డిమాండ్ ను మరోసారి రికార్డులో ఉంచడానికి నేను మీకు లేఖ రాస్తున్నాను. నేను, నా సహచరులు గతంలో పార్లమెంటు ఉభయ సభల్లో ఈ డిమాండ్ ను అనేక సందర్భాల్లో లేవనెత్తాం’’ అని కాంగ్రెస్ చీఫ్ తన లేఖలో పేర్కొన్నారు.
My letter to the Prime Minister demanding the publication of Socio Economic Caste Census.
Regular decennial Census was to be carried out in 2021 but it has not been conducted. We demand that it be done immediately and that a comprehensive Caste Census be made it’s integral part. pic.twitter.com/eoL52gRFC1
‘‘యూపీఏ ప్రభుత్వం తొలిసారిగా 2011-12లో 25 కోట్ల కుటుంబాలను కవర్ చేస్తూ సామాజిక, ఆర్థిక, కుల గణన (ఎస్ఈసీసీ) నిర్వహించిన విషయం మీకు తెలుసు. 2014 మేలో మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కులాల డేటాను విడుదల చేయాలని కాంగ్రెస్, ఇతర ఎంపీలు డిమాండ్ చేశారు. అయితే అనేక కారణాల వల్ల కుల గణాంకాలు ప్రచురితం కాలేదన్నారు.’’ అని తెలిపారు.
‘‘అప్ డేటెడ్ కుల గణన లేనప్పుడు, అర్థవంతమైన సామాజిక న్యాయం, సాధికారత కార్యక్రమాలకు.. ముఖ్యంగా ఓబీసీలకు చాలా అవసరమైన విశ్వసనీయమైన డేటాబేస్ అసంపూర్తిగా ఉందని నేను భయపడుతున్నాను. ఈ జనాభా గణన కేంద్ర ప్రభుత్వ బాధ్యత’’ అని తెలిపారు.
2021లో క్రమం తప్పకుండా దశాబ్ద జనాభా గణన చేపట్టాల్సి ఉందని, కానీ ఇంతవరకు నిర్వహించలేదని మల్లికార్జున్ ఖర్గే తన లేఖలో పేర్కొన్నారు. దీనిని వెంటనే చేపట్టాలని, సమగ్ర కుల గణనను అంతర్భాగం చేయాలని తాము డిమాండ్ చేస్తున్నామని ఖర్గే చెప్పారు. కాగా.. ఖర్గే ప్రధానికి రాసిన లేఖను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ట్విట్టర్ లో షేర్ చేశారు. ‘‘జిత్నీ ఆబాదీ, ఉత్నా హక్! 2021లో జరగాల్సిన దశాబ్దపు జనాభా గణనను వెంటనే నిర్వహించాలని, కుల గణనను అందులో అంతర్భాగం చేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ప్రధానికి లేఖ రాశారు.’’ అని క్యాప్షన్ పెట్టారు.
విషాదం.. పెన్ గంగాలో పడి యువకుడు మృతి.. కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఘటన
ఇదిలా ఉండగా.. 2011 కుల ఆధారిత జనాభా లెక్కలను పబ్లిక్ డొమైన్ లో విడుదల చేయాలని, రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని తొలగించాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆదివారం కర్నాటకలోని కోలార్ లో జరిగిన ర్యాలీలో ప్రధాని మోడీకి సవాల్ విసిరారు. ‘‘2011లో యూపీఏ కులాల వారీగా జనాభా గణన చేపట్టింది. అందులో అన్ని కులాల డేటా ఉంది. మిస్టర్ ప్రైమ్ మినిస్టర్, మీరు ఓబీసీల గురించి మాట్లాడుతున్నారు. ఆ డేటాను బహిర్గతం చేయండి. దేశంలో ఎంతమంది ఓబీసీలు, దళితులు, గిరిజనులు ఉన్నారో దేశానికి తెలియజేయండి’’ అని తెలిపారు.