ప్రేమికులకు శుభవార్త: తాజ్‌మహాల్ సందర్శనకు సర్కార్ అనుమతి.. కండిషన్స్ అప్లై

By Siva KodatiFirst Published Aug 20, 2020, 8:48 PM IST
Highlights

ప్రేమకు ప్రతిరూపం, ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్‌మహాల్‌ పర్యాటకుల సందర్శనకు సిద్ధమైంది. సెప్టెంబర్ 1 నుంచి ఆగ్రాలోని తాజ్‌మహల్, ఆగ్రా కోటను పర్యాటకుల కోసం తెరిచి ఉంచాలని జిల్లా  కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. 

కోవిడ్ నియంత్రణలో భాగంగా లాక్‌డౌన్ విధించింది. దీంతో మార్చి నుంచి పురావస్తు శాఖ పరిధిలోని అన్ని పర్యాటక ప్రదేశాలను మూసి వుంచారు.

అయితే కేంద్రం దశలవారీగా లాక్‌డౌన్ నిబంధనలు సడలిస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా జూలై నుంచి కోవిడ్ 19 నిబంధనలు పాటిస్తూ పర్యాటక ప్రదేశాలు సైతం తిరిగి తెరిచేందుకు అనుమతించింది.

ఈ ఆదేశాలకు అనుగుణంగానే తాజ్‌మహాల్, ఆగ్రా కోట, ఫతేపూర్ సిక్రీలను తొలి దశలో సందర్శకులు కోసం తెరిచేందుకు అనుమతులిస్తూ ఆగ్రా జిల్లా కలెక్టర్ పీఎన్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే పర్యాటకలకు మాస్క్‌లు, భౌతిక దూరం తప్పనిసరి. 

click me!