సెరో సర్వే: ఢిల్లీ వాసుల్లో 28 శాతానికి పెరిగిన యాంటీబాడీస్

By narsimha lodeFirst Published Aug 20, 2020, 4:29 PM IST
Highlights

ఢిల్లీలోని 29 శాతం మంది జనాభాలో యాంటీబాడీసీ అభివృద్ధి చెందాయి. సెరోలాజికల్ సర్వే ఈ విషయాన్ని వెల్లడించింది.ఈ నెల 1వ తేదీ నుండి ఆగష్టు వరకు ఢిల్లీలోని 29.1 శాతం మంది ప్రజలను సర్వే చేస్తే ఈ విషయం వెల్లడైనట్టుగా ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది.

న్యూఢిల్లీ: ఢిల్లీలోని 29 శాతం మంది జనాభాలో యాంటీబాడీసీ అభివృద్ధి చెందాయి. సెరోలాజికల్ సర్వే ఈ విషయాన్ని వెల్లడించింది.ఈ నెల 1వ తేదీ నుండి ఆగష్టు వరకు ఢిల్లీలోని 29.1 శాతం మంది ప్రజలను సర్వే చేస్తే ఈ విషయం వెల్లడైనట్టుగా ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది.

పురుషుల కంటే మహిళల్లో యాంటీ బాడీస్ ఎక్కువగా ఉన్నట్టుగా ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్రజైన్ చెప్పారు. మహిళల్లో 32.2 శాతం యాంటీ బాడీస్ వృద్ధి చెందితే పురుషుల్లో 28.3 శాతంగా ఉన్నాయని ఆయన వివరించారు.రాష్ట్రంలో మొదట నిర్వహించిన సర్వేతో పోలిస్తే రెండో సర్వేలో యాంటీ బాడీస్ 6 శాతం పెరిగినట్టుగా సర్వే తేల్చింది.

ఈ ఏడాది జూన్ 27 నుండి జూలై 10వ తేదీన తొలి విడత సెరో సర్వే నిర్వహించారు. ఆ సమయంలో ఢిల్లీ వాసుల్లో 22.86 శాతం మాత్రమే యాంటీబాడీస్ వృద్ధి అయ్యాయని తేలింది.  21,387 మంది నుండి ఆ సమయంలో శాంపిల్స్ సేకరించారు.

ఈ నెల మొదటి వారంలో 15 వేల మంది నుండి శాంపిల్స్ సేకరిస్తే మొదటి సర్వేతో పోలిస్తే 6 శాతం అదనంగా యాంటీ బాడీస్ వృద్ధి చెందినట్టుగా తేలింది. ఈ ఏడాది సెప్టెంబర్ 1వ తేదీ నుండి మూడో విడత సర్వేను నిర్వహించనున్నారు.

also read:సిరో సర్వైలెన్స్ షాకింగ్ సర్వే: విజయవాడలో 40.51 శాతం మందికి కరోనా.. రికవరీ..!

18 ఏళ్లలోపు వారిలో యాంటీబాడీస్ 34.7 శాతాం, 18 ఏళ్ల నుండి 50 ఏళ్ల మధ్య వారికి 28. 5 శాతం, 50 ఏళ్లు పై బడిన వారికి 31. 2 శాతంగా ఉన్నట్టుగా ఈ సర్వే తెలిపింది.కరోనా సోకి రికవరీ అయిన వారికి 3 నుండి 8 నెలల మధ్యలో యాంటీబాడీస్ అత్యధికంగా కన్పిస్తాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో కరోనా తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

click me!