సయ్యద్ తహ్మీనా రిజ్వీ , షరీకా మాలిక్ భారతదేశంలోని రెండు వేర్వేరు పట్టణాలలో, విభిన్న సంస్కృతుల మధ్య పెరిగారు. ఒకరిది కాశ్మీర్.. మరొకటి ఉత్తరప్రదేశ్.. కానీ వారి ఎదుగుదల అనుభవాల్లో సారూప్యతలున్నాయి. వారి జీవిత ప్రయాణంలో ఎదురైన ఎన్నో అడ్డంకులను అధిగమించి.. నూతన మార్గంలో అడుగులేవారు. నేడు నలుగురికి ఆదర్శంగా నిలిచారు. వారి స్పూర్తిధాయక కథనం మీ కోసం..
సయ్యద్ తహ్మీనా రిజ్వీ , షరీకా మాలిక్ భారతదేశంలోని రెండు వేర్వేరు పట్టణాలలో, విభిన్న సంస్కృతుల మధ్య పెరిగారు. ఒకరిది కాశ్మీర్.. మరొకటి ఉత్తరప్రదేశ్.. కానీ వారి ఎదుగుదల అనుభవాల్లో సారూప్యతలున్నాయి. వారి జీవిత ప్రయాణంలో ఎదురైన ఎన్నో అడ్డంకులను అధిగమించి.. నూతన మార్గంలో అడుగులేవారు. నేడు నలుగురికి ఆదర్శంగా నిలిచారు. వారి స్పూర్తిధాయక కథనం మీ కోసం..
సయ్యద్ తహ్మీనా రిజ్వీ తన కుటుంబం నుండి కాశ్మీర్ వెలుపల చదువుకున్న మొదటి మహిళగా గర్వపడుతోంది. “మా పెద్ద కుటుంబంలో, ఏ స్త్రీ కూడా గ్రాడ్యుయేషన్‌కు మించి చదవాలని ఆలోచించలేదు. వారు సాంప్రదాయ మార్గంలో నడిచారు. వారి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి వివాహం చేసుకున్నారు.కానీ నేను అలా చేయలేదు. అని అంటారు. గ్రేటర్ నోయిడాలోని బెన్నెట్ యూనివర్శిటీ నుండి డిగ్రీ , సౌత్-ఢిల్లీలో Ph.Dలో చేశారు.
undefined
బుద్గాం జిల్లాలోని మగామ్‌కు చెందిన తెహ్మీనా మాట్లాడుతూ.. తాను విజయబాటలో సాగుతున్న తన బంధువులు, పొరుగువారు, ఆమె కుటుంబం కూడా గర్వపడదని, కానీ.. తన గురించి గర్వంగా భావిస్తానని అన్నారు. వారికి తాను పరాయి దానిలా కనిపిస్తానని అని అంటారు . సాంప్రదాయ, సంపన్నమైన కాశ్మీరీ ముస్లిం కుటుంబంలో పెరిగిన అమ్మాయిగా తహ్మీనా జీవితాన్ని తిరిగి చూసుకుంటే.. తాను ఔత్సాహికురాలినని అంటారు. 10 సంవత్సరాల వయస్సు నుండే తాను ఫ్యాషన్‌లో పాల్గొనడం ప్రారంభించాననీ, ఫ్యాషన్ బ్రాండ్‌ను రూపొందించడానికి ప్రయత్నించాననీ,కానీ.. తన కుటుంబంలో ఎవరూ తన కలలను పట్టించుకోలేదని వాపోతారు.
తన సోదరుడు 12వ తరగతి పూర్తి చేసిన తర్వాత.. బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో కోర్సు చేయడం కోసం పూణేకు పంపడంతోపాటు, చదువుల కోసం అనేక ఎంపికలను ఆఫర్ చేయగా.. తన చదువు కోసం మాత్రం కుటుంబంతో పోరాడాల్సి వచ్చిందనీ, సమాజంలో మగ, ఆడ మధ్య అనేక వ్యత్యాసాలు చూపిస్తారని తహ్మీనా అవాజ్-ది వాయిస్‌తో తన ఆవేదన వ్యక్తం చేశారు.
గుల్‌మార్గ్‌లోని ప్రసిద్ధ రిసార్ట్‌కు దగ్గరగా ఉన్న సుందరమైన పట్టణమైన మాగంలో గడిపిన తన బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ.. ప్రతిదాని గురించి తెలుసుకోవాలనే ఆసక్తి తన చిన్ననాటి నుండే ఉందని ఆమె చెప్పింది. ఆమెను ఎవరినైనా ఏ ప్రశ్న అడిగితే.. చాలా కఠినంగా సమాధానమిచ్చేందట. అ సందర్భంలో "నువ్వు అమ్మాయివి." అని గుర్తు చేసేవారంట. మంచి అమ్మాయిలు సమాజ నిబంధనలకు అనుగుణంగా ఉంటారని,వారు తమ తల్లిదండ్రులను అసలు ప్రశ్నించారు. కానీ.. తిరుగుబాటు భావాలున్నారనే ..ప్రశ్నిస్తారని అన్నారు. అదేసమయంలో తన తల్లి తనకు చెప్పిన మాటలను కూడా గుర్తు చేసుకుంది. అమ్మాయిలు తమను ఆకర్షించే విధంగా ఉండాలనీ, బాలికలకు వారి శరీరాన్ని వీలైనంత ఎక్కువ కవర్ చేయడం ఉత్తమ మార్గమనీ, వ్యాపారాన్ని విజయవంతంగా నిర్వహించే తన తండ్రి ఇంట్లో తలకు చున్నీ కప్పుకోనందుకు ఓ సారి చాలా కోప పడ్డారని చెప్పుకొచ్చింది.
తన చదువు విషయంలో కుటుంబంతో ఎన్నో సార్లు పోరాటం చేశాననీ, సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ కోసం కోచింగ్ క్లాస్‌లో చేరడానికి ఢిల్లీకి పంపమని చిన్న సైజ్ యుద్దమే చేసాననీ, వారు విముఖత చూపారు, కానీ స్నేహితుడి సలహా మేరకు, వారు తన కలను నెరవేర్చుకోవడానికి తెహ్మినాను అనుమతించారు. అలా.. తల్లిదండ్రులను ఒప్పించడంలో పోరాడి విజయం సాధించానని అంటారు. కోచింగ్ క్లాసుల్లోనే కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ బాక్ డ్రాప్ చెందిన తన జీవిత భాగస్వామిని కలిశారు.వారిద్దరూ మూడేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. టెహ్మీనా తన సివిల్ సర్వీస్ కలను కొనసాగించాలనే ఆలోచనను విరమించుకున్నప్పుడు, ఆమె కుటుంబం మళ్లీ ఆమెపై కోపండి.
తెహ్మీనా కో-ఎడ్యుకేషనల్ స్కూల్ నుండి బాలికల పాఠశాలకు మారినప్పుడు, ఇతరులు ఆమెను వింతగా చూశారు.సల్వార్ కాకుండా పలాజో ధరించినప్పుడు కూడా ఇతరులు విమర్శించారు. టెహ్మీనా ఈ రోజు తన విలువలతో జీవిస్తుంది. మహిళల హక్కుల కోసం పోరాడుతోంది. వారికి ఇంటర్-ఫెయిత్ కమ్యూనికేషన్‌కు మద్దతు ఇస్తుంది.
షారికా మాలిక్
ఢిల్లీకి చెందిన కవయిత్రి, మార్కెటింగ్ ప్రొఫెషనల్, టీచర్ అయిన 28 ఏళ్ల షరికా మాలిక్ తనను తాను ఆర్థికంగా స్వతంత్ర మహిళగా నిర్వచించుకోవడానికి ఇష్టపడుతుంది. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో పెరిగిన ఈ యువతి తన జీవితంలో ఎన్నో అడ్డంకులను అధిగమించింది. ఆమె స్కూలింగ్ ముస్లిం పాఠశాల్లో కాకుండా.. సాధారణ పాఠశాలలోనే సాగింది. ఆమె పాఠశాలలో చాలా మంది హిందూ విద్యార్థులే ఉండేవారు. కొద్దిమంది మాత్రమే ముస్లిం విద్యార్థులు. తన స్కూల్ యూనిఫాంలో భాగంగా ట్యూనిక్, స్కర్ట్ ధరించేది. ప్రతి ఆడ పిల్ల ఇలాంటి డ్రెస్సే వేసుకునే వారు.
కానీ తన అమ్మ ఎప్పుడూ దాని గురించి ఆందోళన చెందుతుండేదనీ, అలాంటి బట్టల్లో చూస్తే.. ఎవరు తనని పెళ్లి చేసుకుంటారని తరచూ చెబుతుండేదని గుర్తు చేసుకున్నారు. సమాజం నిర్ణయించిన నియమాలు ప్రతి అమ్మాయికి అనేక పరిమితులను నిర్ణయిస్తాయి. అలాంటి భారం నుంచి షరికను తన తండ్రి రక్షించారు.ఆమె తండ్రి ప్రగతిశీల వ్యక్తి, ఆయన ఆగ్రికల్చర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI)లో పని చేస్తున్నారు.
ఈ సందర్భంగా తాను 9వ తరగతి చదువుతున్నప్పుడూ జరిగిన సంఘటనను గుర్తు చేసుకుంది. ఇంటికి కొంతమంది అతిథులు వస్తున్నారని తన తల్లి దుపట్టా ధరించి రావాలని కోరింది. అది చిన్న సంఘటననే అయినా తన మదిలో ఓ చేదు జ్థాపకంగా గుర్తుండిపోయింది. అలాంటి ఆంక్షలు యువతి మనస్సుకు హానికరమని, ఇలా విషయాలను తల్లిదండ్రులు ప్రేమతో చెప్పాలని అంటారు షారికా మాలిక్. అమ్మాయిలకు యువకుల మాదిరిగానే ఉంటాయనీ, తాను కూడా అలాంటి కలలు ఉన్నా.. పలు ఆంక్షలు తనకు అడ్డుగా నిలిచాయని అన్నారు.
గ్రాడ్యుయేషన్ తర్వాత, షారిక టీచర్ కావడానికి ఒక కోర్సులో చేరింది. అప్పటికి అతని తల్లి చనిపోయింది. ఆమె పాఠాలు చెప్పాలంటే చీర కట్టుకుని మేకప్ వేసుకోవాల్సి వచ్చింది. కానీ తన చుట్టు పక్కల వారు, బంధువులు వ్యతిరేకించారు. లిప్ స్టిక్ వేసుకుని చీర కట్టుకోవడం పట్ల ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేశారని తెలిపారు. కానీ, తన తండ్రి తనకు సపోర్టుగా నిలబడ్డారనీ, తనలో ఆత్మవిశ్వాసాన్ని నింపారని ఆమె చెప్పుకొచ్చింది.
ఆంక్షలతో జీవిస్తూనే చదువుకోవాలని తల్లి కోరుతుండగా, తన తండ్రి ప్రోత్సాహం, ప్రోత్సాహం వల్లే తాను ఈరోజు స్వేచ్ఛా మహిళనని నమ్ముతోంది. షారిక తన సోదరుడు, అతని కుటుంబంతో కలిసి ఢిల్లీలో నివసిస్తుంది. ఆమె నేడు మార్కెటింగ్ ప్రొఫెషనల్‌గా పనిచేస్తుంది. తన కవిత్వాన్ని ప్రజలు ఆదరిస్తున్నారని, రాసేందుకు డబ్బులిస్తున్నారని సంతోషం వ్యక్తం చేస్తోంది.