2014 తర్వాత తొలి ముస్లిం మహిళా ఎంపీ

First Published May 31, 2018, 6:12 PM IST
Highlights

2014 తర్వాత లోక్‌సభలోకి  మహిళా ముస్లిం ఎంపీగా రికార్డు

లక్నో:ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని కైరానా స్థానం నుండి
ఆర్ఎల్డీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించిన
తబస్సుమ్ హసన్  2014 తర్వాత తొలిసారిగా
పార్లమెంట్‌లోకి అడుగుపెడుతున్న ముస్లిం అభ్యర్ధిగా చరిత్ర
సృష్టించారు.

కైరానా స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్ధి
మృగంకాసింగ్ పై తబస్సుమ్ హసన్ 55 వేల ఓట్ల
మెజారిటీతో విజయం సాధించారు. 2014 లో జరగిన
ఎన్నికల్లో ముస్లిం అభ్యర్ధులు ఎవరూ కూడ పార్లమెంట్ లో
అడుగుపెట్టలేదు.

తాజా ఉప ఎన్నికల్లో కైరానా నుండి విజయం సాధించిన
తబస్సుమ్ హసన్ పార్లమెంట్ లో అడుగుపెట్టే ముస్లిం
మహిళగా రికార్డులకెక్కారు.


2014లో బీజేపీ-ఆప్నాదళ్‌ కూటమి మోదీ హవాతో
రాష్ట్రంలోని 80 స్థానాలకు గాను 73 స్థానాల్లో విజయం
సాధించింది. మిగిలిన సీట్లను కాంగ్రెస్‌-ఎస్పీ కూటమి
సొంతం చేసుకుంది. వీరిలో ఒక్క ముస్లిం కూడా విజయం
సాధించలేకపోవడం విశేషం. ఇటీవల జరిగిన గోరఖ్‌పూర్‌,
పూల్పూర్‌ లోక్‌సభ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన
ఎస్సీ- బీఎస్సీ కూటమి ముస్లిం అభ్యర్ధులను బరిలో
నిలపలేదు.

ప్రస్తుతం లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఏకైక యూపీ
ముస్లిం లోక్‌సభ సభ్యురాలిగా తబస్సుమ్‌ నిలవగా,
రాజ్యసభలో ఇద్దరు ముస్లింలు జావేద్‌ అలీ ఖాన్‌, తన్జీమ్
ఫాట్మాలు ఎస్పీనుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

click me!