మోడీపై విమర్శలు: ఎన్డీఏతో శివసేన తెగతెంపులు?

First Published May 31, 2018, 5:52 PM IST
Highlights

మోడీపై శివసేన షాకింగ్ కామెంట్స్

ముంబై:మహరాష్ట్రలోని పాల్ఘార్ ఎంపీ స్థానంలో ఓటమిని
తాము ఒప్పుకోవడానికి సిద్దంగా లేమని శివసేన చీఫ్ ఉద్దవ్
ఠాక్రే చెప్పారు.ఈ స్థానంలో రీ కౌంటింగ్ చేయాలని ఆయన
డిమాండ్ చేశారు. 

 ప్రధానమంత్రి మోడీపై ఉద్దశ్ ఠాక్రే తీవ్ర విమర్శలు
గుప్పించారు. ఎన్డీఏ నుండి శివసేన బయటకు వచ్చే
అవకాశం ఉందనే ప్రచారం కూడ సాగుతోంది.


మహరాష్ట్రలోని రెండు ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరిగితే
ఒక్క స్థానంలోనే బిజెపి విజయం సాధించింది. పాల్ఘార్
స్థానంలో  శివసేన పై బిజెపి అభ్యర్ధి విజయం సాధించారు.

అయితే ఈ ఎన్నికల ఫలితాలపై ఉద్దవ్ ఠాక్రే గురువారం
సాయత్రం ముంబైలో స్పందించారు. 

ఎన్నికల సందర్భంగా కొందరు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు
డబ్బులు పంచారని ఆయన చెప్పారు. అయితే వీరిపై
చర్యలు తీసుకోవాలని ఈసీని కోరితే చర్యలు
తీసుకోలేదన్నారు.

డబ్బులు పంచినవారంతా బిజెపి నేతలతో కలిసి సంబరాలు
చేసుకొంటున్నారని ఆయన చెప్పారు. బిజెపికి మిత్రపక్షాలు
అవసరం లేదన్నారు.  రీ కౌంటింగ్ చేయాలని  శివసేన
డిమాండ్ చేస్తోందని ఆయన చెప్పారు.


ఇటీవల కాలంలో జరుగుతున్న ఎన్నికల్లో బిజెపి వరుసగా
ఓటమికి గురౌతోందని ఆయన చెప్పారు. బిజెపికి
వ్యతిరేకంగా అన్ని పార్టీలు కలిసిరావాలని ఆయన కోరారు.  
ఎన్డీఏ నుండి కూడ శివసేన బయటకు వచ్చే అవకాశం
లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

లోక్‌సభలో బిజెపి మెజార్టీని కోల్పోయిందని ఉద్దవ్ ఠాక్రే
చెప్పారు. యూపీలో కూడ బిజెపి ప్రజల విశ్వాసాన్ని
కోల్పోయిందన్నారు. మహారాష్ట్రలో యూపీ సీఎం యోగి
ఆదిత్యనాథ్ ప్రచారం చేసినా ప్రయోజనం లేకుండా
పోయిందన్నారు. 

 

click me!