జిమ్నాస్టిక్ తో విలువిద్య... ఈ యువతి టాలెంట్ కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..!

Published : Apr 05, 2023, 11:51 AM IST
జిమ్నాస్టిక్ తో విలువిద్య... ఈ యువతి టాలెంట్ కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..!

సారాంశం

 చాలా మంది జిమ్నాస్టిక్స్ చేస్తారుగా అని మీరు అనుకోవచ్చు. అయితే.. ఆ అమ్మాయి జిమ్నాస్టిక్స్ చేయడమే కాదు.. అందులో భాగంగానే విలువిద్య చేయగలదు. అది కూడా  కాళ్లతో బాణాలు కూడా వేయగలదు

ఈరోజుల్లో ఏ ఒక్కరూ సాధారణంగా ఉండటానికి ఇష్టపడటం లేదు. తమలో ఉన్న టాలెంట్ ని బయటి ప్రపంచానికి చూపించడానికే ఉత్సాహం చూపిస్తున్నారు. తాజాగా ఓ యువతి టాలెంట్ చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. వావ్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇంతకీ ఆ యువతిలో ఉన్న టాలెంట్ ఏంటో తెలుసా..? జిమ్నాస్టిక్స్ చేయగలదు. దానిదేముంది..? చాలా మంది జిమ్నాస్టిక్స్ చేస్తారుగా అని మీరు అనుకోవచ్చు. అయితే.. ఆ అమ్మాయి జిమ్నాస్టిక్స్ చేయడమే కాదు.. అందులో భాగంగానే విలువిద్య చేయగలదు. అది కూడా  కాళ్లతో బాణాలు కూడా వేయగలదు. అది చూస్తే ఎవరికైనా కళ్లు ఆశ్చర్యంతో పెద్దవి చేయకమానరు.

 


ఈ వీడియోను షానెన్ అనే యువతి  ట్విటర్‌లో పంచుకున్నారు. క్లిప్‌లో ఆమె ఒక లక్ష్యంపై మండుతున్న బాణం వేయడానికి సిద్ధమవుతున్నట్లు చూపిస్తుంది. రెండు వ్యక్తిగత ప్లాట్‌ఫారమ్‌లపై తనను తాను బ్యాలెన్స్ చేసుకుంది. ఆ తర్వాత   ఆమె తన కాళ్ళను పైకి పైకి లేపుతుంది. తర్వాత తన పాదాలతో విల్లును పట్టుకుంది. వీడియో ప్రారంభం కాగానే, షానెన్ విల్లు, మండుతున్న   బాణంతో తన స్థానాన్ని తీసుకొని.. బాణాన్ని వదలింది. చూడటానికి రెండు కళ్లు సరిపోవా అనే భావన కలుగుతుంది.

ఈ వీడియో ని ఇప్పటి వరకు  2.2 మిలియన్లకు పైగా వీక్షించారు. టన్నుల కొద్ది కామెంట్ల వర్షం కురుస్తోంది. నెటిజన్లు ఆమె టాలెంట్ ఫిదా అయిపోయారు.  షానెన్‌పై ప్రశంసలు కురిపించారు. ఆమెపై అభినందనలు వెల్లువిరుస్తున్నాయి. కాగా.. షానెన్ 17సంవత్సరాలుగా ఇది నేర్చుకుంటున్నానని ఆమె చెప్పారు. అంతేకాదు తాను ఆరేళ్ల వయసు నుంచి నేర్చుకోవడం మొదలుపెట్టానని ఆమె చెప్పడం విశేషం.


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు.. వీటివల్ల లాభాలేంటో తెలుసా?
Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?