ఢిల్లీలో స్విట్జర్లాండ్ మహిళ హత్య : కాళ్లు, చేతులు కట్టేసి, ప్లాస్టిక్ కవర్ తో చుట్టి... వెలుగులోకి షాకింగ్ వి

By SumaBala Bukka  |  First Published Oct 30, 2023, 1:01 PM IST

ఢిల్లీలో హత్యకు గురైన స్విట్జర్లాండ్ మహిళ నినా బెర్గర్‌ను ప్లాస్టిక్ బ్యాగ్‌తో ఊపిరాడకుండా చేసి చంపారని పోస్ట్‌మార్టం నివేదికలో వెల్లడయ్యింది. 


న్యూఢిల్లీ : ఈ నెల ప్రారంభంలో ఢిల్లీలో ఓ స్విట్జర్లాండ్ మహిళ మృతి సంచలనం రేపింది. ఆమె మృతదేహం చెత్త కవర్ మూటకట్టి దొరికింది. స్విట్జర్లాండ్ మహిళ హత్యకు సంబంధించి సంచలనాత్మక విషయాలు వెలుగు చూస్తున్నాయి. నినా బెర్గర్ అనే ఆమెను కారులో ప్లాస్టిక్ బ్యాగ్‌ని ఉపయోగించి ఊపిరాడకుండా చేసి, గొంతుకోసి చంపారని పోస్ట్‌మార్టం నివేదికలో తేలినట్టు పోలీసులు తెలిపారు. 

హత్య సమయంలో ఆమె చేతులు, కాళ్లు, నోరు కట్టివేసి ఉందని.. ఆమె బాధతో విలవిలలాడుతుంటే చూసి నిందితుడు సంతోషించాడని వారు తెలిపారు. ఆమె తనను తాను విడిపించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించింది. అది చూసి నిందితుడు పగలబడి నవ్వాడని తెలిపారు. ఆమె చనిపోయే ముందు సుమారు 30 నిమిషాల పాటు ప్రాణాల కోసం పోరాడిందని నివేదికలో తెలిపారు. 

Latest Videos

కెఇఎ బ్లూటూత్ స్కామ్ : పరారీలో ప్రధాన నిందితుడు ఆర్‌డి పాటిల్.. పిఎస్‌ఐ మాల్‌ప్రాక్టీస్‌లోనూ అతనే సూత్రధారి..

"ఈ పెనుగులాటలో ఆమె కళ్ళు బైటికి పొడుచుకు వచ్చాయి. నిందితుడు ఆమె దుస్థితిని చూసి నవ్వుకున్నాడు" అని వారు చెప్పారు. ఆ తరువాత ఆమె మృతదేహాన్ని డ్రైవర్ సీటు పక్కనే ఉన్న సీటులో పడేశాడే. కారు కిటికీలకు నల్లటి సన్‌షేడ్‌లను ఉపయోగించాడని తెలిపారు. 

అక్టోబరు 20న తిలక్ నగర్‌లోని ప్రభుత్వ పాఠశాల సమీపంలో మహిళ మృతదేహం నల్లటి చెత్త బ్యాగ్‌లో సగం కప్పబడి కనిపించింది. ఈ కేసులో గురుప్రీత్ సింగ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతను స్విట్జర్లాండ్‌లో ఉన్న మహిళతో స్నేహం చేసాడు. ఆమె నుండి డబ్బు వసూలు చేయాలనుకున్నాడని అధికారులు తెలిపారు. 

గుర్‌ప్రీత్ స్విట్జర్లాండ్‌లోని బెర్గర్‌ దగ్గరికి వెడుతుండేవాడు. ఈ క్రమంలో ఆమెకు వేరే వ్యక్తితో సంబంధం ఉన్నట్లు అనుమానించాడని పోలీసులు తెలిపారు. దీంతో అతను బెర్గర్‌ను హత్య చేయాలని ప్లాన్ చేసి, ఆమెను భారత్ కు రావాలని ఆహ్వానించాడని వారు చెప్పారు.

అక్టోబరు 11న బెర్గర్ భారతదేశంలో అడుగుపెట్టింది. ఆమె వచ్చిన కొద్ది రోజులకే నిందితుడు తన హత్య ప్రణాళికను అమలు చేశాడు. నకిలీ గుర్తింపును ఉపయోగించి కారును కొనుగోలు చేశాడు. హత్య చేసిన తరువాత మృతదేహం నుంచి దుర్వాసన వచ్చేవరకు డెడ్ బాడీని కారులోనే ఉంచాడు. ఆ తరువాత రోడ్డు మీదికి విసిరేశాడు. 

సీసీటీవీ ఫుటేజీ సాయంతో వాహనం రిజిస్ట్రేషన్‌ నంబర్‌ను గుర్తించిన పోలీసులు గురుప్రీత్‌ను గుర్తించినట్లు సమాచారం. మృతదేహాన్ని ఉంచిన కారును, గురుప్రీత్‌కు చెందిన మరో ఫోర్ వీలర్ ను స్వాధీనం చేసుకున్నారు.నిందితుడి ఇంటి నుంచి 2.25 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు.

click me!