మీ క్రష్ కి టీ ఇష్టం లేదా..? స్వీగ్గీ ప్రశ్నకు ట్విట్టర్ రియాక్షన్ ఇదే..!

Published : Feb 28, 2023, 09:37 AM IST
మీ క్రష్ కి టీ ఇష్టం లేదా..? స్వీగ్గీ ప్రశ్నకు ట్విట్టర్ రియాక్షన్ ఇదే..!

సారాంశం

 టీ విషయంలో రెండు భిన్న అభిప్రాయాలు ఉన్నవారు ప్రేమలో పడితే... ఎలా ఉంటుుంది..? ఈ అనుమానం మాకు కాదు.. స్విగ్గీకి వచ్చింది.  

మనలో చాలా మందికి టీ అంటే ఒక ఎమోషన్. ఉదయం లేవగానే కడుపులో ఒక కప్పు టీ పడనిది రోజు ప్రారంభం కాదు. కొందరైతే.. రోజులో ఎన్నిసార్లు అయినా టీ అంటే తాగుతూనే ఉంటారు. ఇక కొందరికి టీ తాగడం కాస్త ఆలస్యమైతే.. తలనొప్పి లాంటివి కూడా వచ్చేస్తూ ఉంటాయి. వారు ఎక్కడికి వెళ్లినా.. తిండి తినడం మానేస్తారేమో కానీ.. టీ తాగడం మాత్రం మానేయరు. అయితే.. ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే. అస్సలు టీ అంటే ఇష్టపడని జాతి కూడా ఉంటుంది. వారు టీ తాగరు.. టీ వాసన ని కూడా ఇష్టపడరు. పైగా టీ ఆరోగ్యానికి మంచిది కాదు అంటూ.. ఇష్టంగా తాగేవారికి క్లాసులు పీకుతూ ఉంటారు. టీ విషయంలో రెండు భిన్న అభిప్రాయాలు ఉన్నవారు ప్రేమలో పడితే... ఎలా ఉంటుుంది..? ఈ అనుమానం మాకు కాదు.. స్విగ్గీకి వచ్చింది.

 

మీరు చదివింది నిజమే.. స్విగ్గీ.. సోషల్ మీడియాలో ఈ మధ్య చాలా చురుకుగా ఉంటోంది. ఈ క్రమంలోనే... తమ సోషల్ మీడియా ఫాలోవర్స్ ని ఓ ప్రశ్న అడిగింది అది కూడా టీ గురించి. మీ క్రష్ కి చాయ్ అంటే అసహ్యం అని చెబితే.. మీరు ఏం చేస్తారు..? కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అంటూ పోస్టు పెట్టింది. ఇక.. ఆ పోస్టుకి నెటిజన్ల రియాక్షన్ మామూలుగా లేదు. అందరూ.. కామెంట్స్ రూపంలో కాకుండా... జిఫ్ ఎమోజీలతో వారి రియాక్షన్ చెప్పడం విశేషం. వాటిని ఇలా రాయడం కంటే... మీరు డైరెక్ట్ గా వారి రియాక్షన్స్ చూస్తే.. నవ్వు ఆపుకోలేరు. మీరు కూడా ఓ లుక్కేయండి.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం
PM Surya Ghar Scheme : ఇలా చేశారో విద్యుత్ ఛార్జీలుండవు.. డబ్బులు సేవ్