జస్టిస్ ఫర్ దిశ: జంతర్ మంతర్‌ వద్ద ఆమరణ దీక్షకు దిగిన స్వాతి

By narsimha lodeFirst Published Dec 3, 2019, 12:47 PM IST
Highlights

 ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ స్వాతి మాలివాల్ మంగళవారం నాడు  న్యూఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద  ఆమరణ నిరహారదీక్షకు దిగారు.

న్యూఢిల్లీ: శంషాబాద్‌ సమీపంలో దిశ‌పై గ్యాంగ్‌రేప్, హత్యకు నిరసనగా  న్యూఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద  ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ స్వాతి మాలివాల్ మంగళవారం నాడు ఆమరణ నిరహారదీక్షకు దిగారు.

హైద్రాబాద్‌లో దిశపై గ్యాంగ్‌రేప్, హత్య తనను తీవ్రంగా కలిచివేసిందని స్వాతి మాలివాల్ చెప్పారు. న్యూఢిల్లీలోని జంతర్ మంతర్  వద్ద ఆమరణ నిరహార దీక్షకు దిగారు.జంతర్‌ మంతర్ వద్ద ఆమరణ నిరహార దీక్షకు దిగే ముందు రాజ్‌ఘాట్‌లో స్వాతి మాలివాల్ మహాత్మాగాంధీకి ఘనంగా నివాళులర్పించారు.

అత్యాచారాలకు పాల్పడిన నిందితులను ఆరు మాసాల్లో ఉరి శిక్ష విధించాలని స్వాతి మాలివాల్ డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్‌తో స్వాతిమాలివాల్ ఆమరణ నిరహారదీక్షకు దిగారు. ప్రభుత్వం ఈ విషయంలో సరైన చట్టం తెచ్చేవరకు తాను ఆందోళన కొనసాగిస్తానని ఆమె ప్రకటించారు.

Also read:దిశ రేప్, హత్య కేసు: రంగంలోకి తమిళిసై, కేంద్రానికి నివేదిక

స్వాతిమాలివాల్ ఆమరణ నిరహారదీక్షకు  మద్దతుగా విద్యార్ధినులు, మహిళలు పెద్ద ఎత్తున జంతర్ మంతర్ వద్దకు వచ్చారు. దిశ హత్య కేసులో నిందితులను  కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

Also Read: justice for disha: కృష్ణా నదిలో ‘దిశ’ అస్థికల నిమజ్జనం

దిశ హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలంటూ నిరసనకారులు ప్ల కార్డులు ప్రదర్శించారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా  నిరసనకారులు నినదించారు.

Also Read: జస్టిస్ ఫర్ దిశ: వెటర్నరీ డాక్టర్ కావడానికి కారణమిదే

రేపిస్టులపై చర్యలు తీసుకొనే విధంగా చట్టాలు తీసుకొని రావాలని తాను ప్రధానికి లేఖ రాసినట్టుగా  కూడ ఆమె చెప్పారు. జంతర్ మంతర్ వద్ద మహిళలు పెద్ద ఎత్తున చేరుకొని స్వాతిమాలివాల్ దీక్షకు మద్దతు పలికారు. 

click me!