స్వరా భాస్కర్ కు కూడా శ్రద్ధా వాకర్ గతే పట్టొచ్చు - వీహెచ్ పీ నాయకురాలు సాధ్వి ప్రాచీ

Published : Feb 22, 2023, 08:53 AM IST
స్వరా భాస్కర్ కు కూడా శ్రద్ధా వాకర్ గతే పట్టొచ్చు - వీహెచ్ పీ నాయకురాలు సాధ్వి ప్రాచీ

సారాంశం

స్వరా భాస్కర్ ఓ ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకునే ముందు ఆమె ఫ్రిడ్జ్ వైపు చూసి ఉండాల్సిందని వీహెచ్ పీ నాయకురాలు సాధ్వి ప్రాచీ అన్నారు. స్వరా ఎప్పుడూ హిందూ మతానికి వ్యతిరేకంగానే మాట్లాడేవారని, దీంతో కచ్చితంగా ఆమె ఇతర మతానికి చెందిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటారని తాను ముందే భావించానని సాధ్వి ప్రాచీ తెలిపారు. 

సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ముస్లిం నాయకుడు ఫహద్ అహ్మద్‌ను వివాహం చేసుకున్న నాటి నుంచి నటి స్వరా భాస్కర్‌ ఎంతో మందికి టార్గెట్ అయ్యారు. ఆమె వివాహంపై సోషల్ మీడియాలో అనేక చర్చలు జరిగాయి. ట్రోల్స్ కూడా జరుగుతున్నాయి. అనేక మంది సోషల్ మీడియా ద్వారా ఆమె వివాహాన్ని వ్యతిరేకించారు. తాజాగా విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పి) నాయకురాలు సాధ్వి ప్రాచీ కూడా ఈ విషయంలో స్వరా భాస్కర్ ను నిందించారు. ఢిల్లీలో ప్రియుడు చేతిలో హత్యకు గురైన శ్రద్ధా వాకర్ గతే స్వరా భాస్కర్ కు పట్టొచ్చని ఆమె అన్నారు. 

ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో మీడియాతో మంగళవారం సాధ్వి ప్రాచీ మాట్లాడారు. ఓ ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనే నిర్ణయం తీసుకునే ముందు స్వరా ఫ్రిడ్జ్ వైపు చూసి ఉండాల్సిందని సూచించారు. ఢిల్లీలో ఆఫ్తాబ్ పూనావాలా తన ప్రియురాలిన హత్య చేసి శరీర భాగాలను అడవిలో పారేయడానికి ముందు శ్రద్ధా వాకర్ మృతదేహాన్ని 35 ముక్కలుగా చేసి ఫ్రిజ్‌లో భద్రపరిచిన సంచలన కేసును ఆమె ప్రస్తావించారు. “బహుశా శ్రద్దా మృతదేహాన్ని 35 ముక్కలుగా నరికివేశారనే వార్తలను స్వరా భాస్కర్ పట్టించుకోలేదు.. ఇంత పెద్ద నిర్ణయం తీసుకునే ముందు ఒకసారి ఆమె ఫ్రిజ్ చూసి ఉండాల్సింది. అది ఆమె వ్యక్తిగత ఇష్టం.. నేను పెద్దగా చెప్పడానికి ఏమీ లేదు. కానీ శ్రద్ధకు జరిగినట్టే స్వరాకు కూడా జరగవచ్చు’’ అని వీహెచ్‌పీ నేత సాధ్వి ప్రాచీ అన్నారు.

వింత నిబంధన : పెళ్లి కాని అమ్మాయిలు ఫోన్లు వాడొద్దు.. గుజరాత్ లో ఠాకూర్ సమాజ్ సభ్యుల నిర్ణయం..

‘‘స్వరా భాస్కర్ ఎప్పుడూ హిందూ మతానికి వ్యతిరేకంగానే స్పందిస్తూ ఉంటారు. ఆమెకు హిందూ మతం అంటే వ్యతిరేక అభిప్రాయాలు ఉన్నాయి. దీంతో ఆమె ఇతర మతానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకుంటారని నేను ముందే భావించాను. అదే ఇప్పుడు జరిగింది. ఆమె ఒక ముస్లిం అబ్బాయిని వివాహం చేసుకుంది.’’ అని అన్నారు.

చర్చకు దారి తీసిన స్వరా భాస్కర్ వివాహం 
ప్రముఖ బాలీవుడ్ నటి, బోల్డ్ బ్యూటీ స్వరా భాస్కర్ రాజకీయ నాయకుడు ఫహద్ అహ్మద్‌తో నిశ్చితార్థం జరిగినట్టు ఫిబ్రవరి 16వ తేదీన ప్రకటించారు. ఆమె గతం నుంచి సోషల్ మీడియాలో చేసే కామెంట్స్ పై కూడా తరచుగా ట్రోలింగ్ జరుగుతూ వైర‌ల్ అవుతూ ఉంటాయి. ఆమె మోడీ ప్రభుత్వంపై విమ‌ర్శ‌లు చేస్తుండ‌టంతో త‌ర‌చు ఆమె పేరు వార్త‌ల్లో వినిపిస్తూ ఉంటుంది. అయితే ఆమె ముంబాయికి చెందిన ప్రేమికుడు ఫహద్‌ అహ్మద్‌ను ఆమె వివాహం చేసుకున్నట్టు ప్రకటించి అందరికీ బిగ్ సర్ప్రైజ్ ఇచ్చింది. ఈ విషయాన్ని ఆమె సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టించారు. ఆమె ప్ర‌క‌ట‌న చేసిన వెంట‌నే ఈ న్యూస్ తెగ వైర‌ల్ అయింది.

అయితే ఈ విహం షరియా చట్టాల ప్రకారం చెల్లుబాటు కాదని ఇస్లామిక్ మత పండితులు పేర్కొన్నారు. దీంతో ఇది సోషల్ మీడియాలో భారీ చర్చకు దారితీసింది. దీనికి కారణం స్వరా ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకున్నప్పటికీ ఇస్లాం మతాన్ని అంగీకరించలేదు. భారతీయ పౌరులు వారి విశ్వాసాలతో సంబంధం లేకుండా వివాహం చేసుకోవడానికి అనుమతించే ప్రత్యేక వివాహ చట్టం కింద స్వరా, ఫహద్ వివాహం చేసుకున్నారు.

'అస్త్ర' క్షిపణి పరీక్ష వాయిదా.. త్వరలో పరీక్ష తేదీ ప్రకటన

ఈ వివాహంపై షికాగోకు చెందిన ఇస్లామిక్ పండితుడు యాసిర్ నదీమ్ అల్ వాజిదీ ట్విటర్ లో స్పందిస్తూ.. ‘‘స్వరా భాస్కర్ ముస్లిం కాకపోతే ఆమె 'కాబోయే' భర్త ముస్లిం అయితే ఈ వివాహం ఇస్లామిక్ గా చెల్లదు. బహుదేవతారాధనను నమ్మే మహిళలను వివాహం చేసుకోవద్దని అల్లాహ్ చెబుతున్నాడు. 2:221 ఆమె కేవలం వివాహం కోసం మాత్రమే ఇస్లాంను స్వీకరిస్తే, దానిని అల్లాహ్ అంగీకరించడు.’’ అని ట్వీట్ చేశారు. కాగా.. మరి కొందరు ఆమె వివాహానికి మద్దతుగా నిలిచారు. 

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం