స్వచ్ఛాతా హి సేవా 2023:‌ సుదర్శన్ పట్నాయక్ కళాకృతి

Published : Oct 01, 2023, 10:13 AM IST
 స్వచ్ఛాతా హి సేవా 2023:‌ సుదర్శన్ పట్నాయక్ కళాకృతి

సారాంశం

దేశ వ్యాప్తంగా స్వచ్ఛతా హే సేవా 2023 కార్యక్రమాన్ని ఇవాళ నిర్వహిస్తున్నారు.  ఈ కార్యక్రమానికి మద్దతుగా  సైకత కళాకారుడు సుదర్శన్ పట్నాయక్  పూరీ బీచ్ లో ఓ కళాకృతిని రూపొందించారు.

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఆదివారం నాడు స్వచ్ఛతా హి సేవా 2023 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.  ఇవాళ ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు  ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులు కావాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ప్రధాని పిలుపు మేరకు  ఈ కార్యక్రమంలో  పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొంటున్నారు.  బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు,  బీజేపీ నేతలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నారు.  కేంద్ర హోంశాఖ మంత్రి అహ్మదాబాద్ లోని సబర్మతి ఆశ్రమంలో శ్రమదానం చేయనున్నారు.  ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని  సైకత కళాకారుడు సుదర్శన్ పట్నాయక్  సైకత కళారూపాన్ని  రూపొందించారు. ఒడిశా రాష్ట్రంలోని పూరీ బీచ్ లో  రూపొందించిన ఈ సైకత కళారూపం పలువురిని ఆకట్టుకుంటుంది. క్లీన్ ఇండియా దేశంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని ప్రధాని మోడీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. 

 

ఈ నెల 2న గాంధీ జయంతిని పురస్కరించుకొని  స్వచ్ఛతా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గత మన్ కీ బాత్ కార్యక్రమంలో  స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం గురించి మోడీ నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమంపై గత నెల  15వ తేదీ నుండి  విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
 

PREV
click me!

Recommended Stories

Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్