గర్భవతైన భార్యకు హెచ్ఐవీ ఇంజెక్షన్.. ఓ భర్త ఘాతుకం...

Published : Sep 13, 2021, 04:24 PM IST
గర్భవతైన భార్యకు హెచ్ఐవీ ఇంజెక్షన్.. ఓ భర్త ఘాతుకం...

సారాంశం

గతేడాది డిసెంబర్లో అతడికి యువతితో వివాహం జరిగింది.  అయితే మహేష్ కు సహోద్యోగినితో అక్రమ సంబంధం ఉందని కొన్నాళ్ళ క్రితం భార్యకు తెలిసింది.  ఈ విషయంపై ఆమె నిలదీయడంతో అప్పటినుంచి విడాకులు కావాలని వేధిస్తున్నాడు.

అలీగఢ్ : ఉత్తర ప్రదేశ్ లో ఓ భర్త అమానవీయ చర్యకు పాల్పడ్డాడు. హెచ్ఐవీ రోగికి ఉపయోగించిన సూదితో గర్బిణి అయిన తన భార్యకు ఇంజెక్షన్ చేశాడు. విడాకులు కావాలని విచక్షణ రహితంగా ప్రవర్తించాడు.  బాధితురాలి తండ్రి ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 

తన కుమార్తె అత్తమామలతో పాటు ఆసుపత్రి యజమాని ఈ కుట్రలో భాగస్వాములని తండ్రి ఆరోపించారు. వీరంతా బంధువులు అని పేర్కొన్నాడు. పోలీసులు, బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... నిందితుడు మహేష్ గౌతమ్ అలీగడ్ లోని ఓ ఆస్పత్రిలోని ల్యాబ్ లో కాంట్రాక్టు టెక్నీషియన్ గా పని చేస్తున్నాడు. 

ఢిల్లీలో కూలిపోయిన నాలుగంతస్తుల బిల్డింగ్.. సహాయక చర్యల్లో ఎన్‌డీఆర్ఎఫ్, పోలీసులు

గతేడాది డిసెంబర్లో అతడికి యువతితో వివాహం జరిగింది.  అయితే మహేష్ కు సహోద్యోగినితో అక్రమ సంబంధం ఉందని కొన్నాళ్ళ క్రితం భార్యకు తెలిసింది.  ఈ విషయంపై ఆమె నిలదీయడంతో అప్పటినుంచి విడాకులు కావాలని వేధిస్తున్నాడు.

ఈ క్రమంలోనే ఓ వ్యక్తికి ఇచ్చిన హెచ్ఐవి సూదితో మహేష్ తన భార్యకు ఇంజక్షన్ చేశాడు. ఈ విషయాన్ని ఆమె తండ్రికి తెలియజేయడంతో ఆయన పోలీసులను ఆశ్రయించాడు. గర్భవతి అని తెలిసినప్పటినుంచి భర్త తనకు హెచ్ఐవి అంటించేందుకు ప్రయత్నిస్తున్నాడని బాధితురాలు ఆరోపించింది. మహేష్ గౌతమ్, అతడి తల్లిదండ్రులు, ఆసుపత్రి యాజమాన్యంపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

PREV
click me!

Recommended Stories

Vijay Meets Governor Arlekar: ప్రభుత్వ ఏర్పాటుకు మూడోసారి గవర్నర్ ను కలిసిన విజయ్| Asianet Telugu
CPI-CPM Joint Press Conference: విజయ్ కు వామపక్షాల మద్దతుసీఎం కుర్చీ ఎక్కనున్న తలపతి| Asianet Telugu