జమ్మూకాశ్మీర్ లో బీజేపీ నాయకుడి అనుమానాస్పద మృతి.. చెట్టుకు వేలాడుతూ క‌నిపించిన మృత‌దేహం

Published : Aug 24, 2022, 09:25 AM ISTUpdated : Aug 24, 2022, 09:26 AM IST
జమ్మూకాశ్మీర్ లో బీజేపీ నాయకుడి అనుమానాస్పద మృతి.. చెట్టుకు వేలాడుతూ క‌నిపించిన మృత‌దేహం

సారాంశం

మూడు రోజుల నుంచి ఆచూకీ లేకుండా పోయిన జమ్మూ కాశ్మీర్ బీజేపీ నేత శవమై కనిపించారు. మృత‌దేహం అనుమానస్పదంగా ఓ చెట్టుకు వేలాడుతూ కనిపించింది. ఇది తీవ్ర కలకలం రేపింది. 

జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లా హీరానగర్ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకుడి మృతదేహం అనుమానాస్పద పరిస్థితులలో చెట్టుకు వేలాడుతూ మంగ‌ళ‌వారం కనిపించింది. ఈ ఘ‌ట‌న స్థానికంగా తీవ్ర క‌ల‌క‌లం రేపింది. ప్ర‌స్తుతం చ‌నిపోయిన బీజేపీ నేత సోమ్ రాజ్ మూడు రోజుల కింద‌ట నుంచి క‌నిపించ‌కుండా పోయారు. 

బీహార్ నితీష్ కుమార్ ప్ర‌భుత్వానికి నేడు బ‌ల‌ప‌రీక్ష..

అయితే ఈ ఘ‌ట‌న‌పై దర్యాప్తు చేసేందుకు పోలీసులు సిట్ ను ఏర్పాటు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం నలుగురు వైద్యులతో కూడిన బోర్డును ఏర్పాటు చేశారు. విచారణ కొనసాగుతోందని కథువా ఎస్ఎస్పీ ఆర్సి కొత్వాల్ తెలిపారు. మృతికి గల కారణాలను ఆరా తీస్తున్నారు.

దేశంలో టొమాటో ఫ్లూ క‌ల‌క‌లం.. రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను అప్ర‌మ‌త్తం చేసిన‌ కేంద్రం.. ప‌లు మార్గ‌ద‌ర్శ‌కాల జారీ

పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. కతువాలోని హీరానగర్లోని తన ఇంటికి స‌మీపంలో ఉన్న చెట్టుకు సోమ్ రాజ్ మృతదేహం వేలాడుతూ క‌నిపించింద‌ని ఓ గ్రామ‌స్తులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. వెంట‌నే అక్క‌డికి చేరుకున్న పోలీసులు మృత‌దేహాన్ని కిందికి దించి, పోస్టుమార్టం నిమిత్తం హాస్పిట‌ల్ కు త‌ర‌లించారు. శరీరంపై రక్తపు ఆనవాళ్లు ఉన్నాయని తెలిపారు.

సోమ్ రాజు ను ఎవ‌రో హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో సోమ్ రాజ్ ఇంటికి చేరుకున్న పలువురు బీజేపీ నేతలు ఆయన మృతిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అయితే మృతుడి కుటుంభ స‌భ్యులు త‌మ‌కు కూడా ప్రాణ‌హాని ఉంద‌ని భ‌య‌ప‌డుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?