
గిరిజన గృహిణి సునీత (29)ను చిత్రహింసలకు గురిచేసిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేత సీమా పాత్ర భార్యను జార్ఖండ్ పోలీసులు బుధవారం తెల్లవారుజామున అరెస్టు చేశారు. అనంతరం ఆమెను మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి.
నేడు నితీష్‌తో భేటీ కానున్న కేసీఆర్.. కొత్త కామెడీ షో అంటూ బీజేపీ సెటైర్..
సునీత తాను ఎదుర్కొన్న కష్టాలను వివరిస్తున్న వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ గా మారింది. సీమ పాత్ర తనను శారీరకంగా హింసించేవారని, వేడి వస్తువులతో కాల్చేవారని పేర్కొన్నారు. అలాగే నాలుకతో టాయిలెట్‌ను శుభ్రం చేయించేరని,సెలవులు అడిగితే తవ్రంగా కొట్టడంతో పాటు గదిలో బంధించారని బాధితురాలు ఆరోపించింది. ఒకసారి తనను ఇనుప రాడ్ తో కొడితే పళ్లు ఊడిపోయాయని కూడా పేర్కొంది. ఈ చర్యలతో ఆమె శరీరమంతా అనేక గాయాలయ్యాయి.
ఈ వీడియో వైరల్ కావడంతో జార్ఖండ్ బీజేపీ స్పందించింది. ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. పోలీసులు కూడా సునీతను రక్షించారు. దీంతో మాజీ IAS అధికారి మహేశ్వర్ పాత్ర భార్య అయిన సీమా పాత్రపై భారతీయ శిక్షాస్మృతి (IPC), SC-ST చట్టం 1989లోని సెక్షన్ల కింద రాంచీలోని అర్గోడా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. మంగళవారం సెక్షన్ 164 కింద సునీత వాంగ్మూలాన్ని కోర్టులో నమోదు చేశారు.
అంధత్వాన్ని జయించి... రూ.47 లక్షల జీతంతో...!
దీంతో సీమా పాత్ర బయపడిపోయి పారిపోయింది. ఆమెను అరెస్టు చేయడానికి రాంచీ పోలీసులు కూడా అనేక ప్రదేశాలపై దాడి చేశారు. ఆమె రాంచీ నుండి రోడ్డు మార్గంలో తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు పోలీసులు సీమాను అరెస్టు చేశారు.
కాగా.. జార్ఖండ్‌లో సీమా పాత్ర తన ఇంటి పనిమనిషిని వేధిస్తున్నట్లు వచ్చిన నివేదికలపై జాతీయ మహిళా కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఆరోపణలు నిజమని తేలితే నిందితులను అరెస్టు చేయాలని జార్ఖండ్ డీజీపీకి ఆ సంస్థ చైర్‌పర్సన్ రేఖా శర్మ లేఖ రాసింది. అలాగే అంతకు ముందు రోజు సీమా పాత్రపై ఎందుకు చర్యలు తీసుకోలేదని జార్ఖండ్ గవర్నర్ రమేష్ బైస్ మంగళవారం డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) నీరజ్ సిన్హాను ప్రశ్నించారు.
హుబ్లీ ఈద్గా మైదానంలో గణేష్ ఉత్సవాలకు అనుమతి.. అర్దరాత్రి ఉత్తర్వులు ఇచ్చిన కర్ణాటక హైకోర్టు
బీజేపీ నాయకురాలైన సీమా పాత్ర ఫేస్ బుక్ ప్రొఫైల్ వివరాల ప్రకారం.. ఆమె బీజేపీ మహిళా విభాగం జాతీయ కార్యవర్గ సభ్యురాలుగా ఉన్నారు. ఆమె భర్త రిటైర్డ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) అధికారి మహేశ్వర్ పాత్ర. సీమా పాత్ర కేంద్రానికి రాష్ట్ర కన్వీనర్ గా కూడా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పథకం 'బేటీ బచావో, బేటీ పడావో' ప్రచార విభాగంలోనూ ఉన్నారని సమాచారం. సీమా పాత్ర గత 8 ఏళ్లుగా బాధిత మహిళ సునీతను చిత్రహింసలకు గురిచేస్తోందని ఆరోపణలు వచ్చాయి.