Surender Matiala Murder Case: బీజేపీ నేత హ‌త్య కేసు.. నిందితులు-పోలీసుల‌కు మ‌ధ్య కాల్పులు.. ఇద్దరు అరెస్టు

Published : May 02, 2023, 11:20 PM IST
Surender Matiala Murder Case:  బీజేపీ నేత హ‌త్య కేసు.. నిందితులు-పోలీసుల‌కు మ‌ధ్య కాల్పులు.. ఇద్దరు అరెస్టు

సారాంశం

Surender Matiala Murder Case: బీజేపీ నేత సురేంద్ర మటియాలా హత్య కేసులో ఇద్దరు అరెస్టు అయ్యారు. సురేంద్ర మటియాలా హత్య కేసులో ఇద్దరు షూటర్లను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అరెస్టు చేయ‌డంతో పాటు వారి నుంచి తుపాకులు, తూటాలను స్వాధీనం చేసుకున్నార‌ని సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి.  

Delhi Police Special Cell Encounter: 2023 మే 15న ఢిల్లీకి చెందిన స్థానిక బీజేపీ నేత సురేంద్ర మటియాలా దారుణ హత్యకు గురయ్యారు. బీజేపీ నేత హత్య కేసులో నిందితులపై ఢిల్లీ స్పెషల్ సెల్ అధికారులు ప్ర‌త్యేక నిఘా పెట్టారు. ఈ క్ర‌మంలోనే ఎన్ కౌంట‌ర్ జరిగినట్టు చేసిన‌ట్టు వార్తాలు వ‌చ్చాయి. తాజాగా ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో పోలీసులకు, దుండగులకు మధ్య కాల్పులు జరిగాయి. మరోవైపు ఇద్దరు దుండగులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రెండు తుపాకులు, ఆరు లైవ్ కాట్రిడ్జ్ లను స్వాధీనం చేసుకున్నారు.

ముందుగా రోహిణిలోని జపనీస్ పార్కు సమీపంలోకి దుండగులు వచ్చినట్లు ఢిల్లీ స్పెషల్ సెల్ అధికారుల‌కు సమాచారం అందింది. ఆ తర్వాత పోలీసులు ఉచ్చు బిగించి దుండగులను పట్టుకున్నారు. సురేంద్ర మటియాలా హత్యలో ఈ ఇద్దరు దుండగుల ప్రమేయం ఉంది. ఈ దుండగులు కపిల్ సంగ్వాన్ అలియాస్ నందు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కు చెందినవారుగా పేర్కొంటున్నారు. 

ఎన్ కౌంట‌ర్ వీడియో దృశ్యాలు బయటకు.. 

ఎన్ కౌంటర్ జరిగిన ప్రదేశంలో బైక్, పిస్టల్ పడి ఉన్న వీడియో బయటకు వచ్చింది. బైక్ రోడ్డుపై పడి ఉండగా, పక్కనే రోడ్డు పక్కనే పిస్టల్ పడి ఉంది. పోలీసు అధికారులు సంఘటనా స్థలంలో అధికారిక చర్యలు తీసుకుంటున్నారు. రోడ్డుపై నుంచి వాహనాల రాకపోకలు కూడా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి.  

ఏప్రిల్ 14న బీజేపీ నేత సురేంద్ర మటియాలా హత్య

ఏప్రిల్ 14న రాత్రి 7.30 గంటల సమయంలో బీజేపీ నేత సురేంద్ర మటియాలా తన కార్యాలయంలో సహచరులతో కూర్చొని ఉండగా హెల్మెట్ ధరించిన ఇద్దరు వ్యక్తులు బైక్ పై వచ్చి ఆయ‌న‌పై ఒక్క‌సారిగా కాల్పుల‌కు తెగ‌బ‌డ్డారు. కాల్పులు జ‌రిపిన త‌ర్వాత దుండగులు అక్క‌డి నుంచి పారిపోయారు. దుండగులు బైక్ పై వస్తున్న సీసీటీవీ ఫుటేజీ కూడా బయటపడింది. సురేంద్ర మటియాలాను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. 

హ‌త్య‌కు బాధ్య‌త వ‌హించిన "కపిల్ సంగ్వాన్ 688"

హ‌త్య జ‌రిగిన మ‌రుస‌టి రోజు సోష‌ల్ మీడియాలో హ‌త్యకు బాధ్య‌త వ‌హిస్తూ ప‌లు స్టేట్ మెంట్లు క‌నిపించాయి. ఏప్రిల్ 15న  'కపిల్ సంగ్వాన్ 688' అనే ఇన్ స్టాగ్రామ్ సురేంద్ర మటియాలా హత్యకు బాధ్యత వహించిందని వార్తలు వచ్చాయి. అదే సమయంలో ఇద్దరు అనుమానితులను కూడా ఏటీఎస్ పట్టుకున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలోనే దూకుడుగా ముందుకు సాగిన పోలీసులు నిందితులను పట్టుకోవడానికి కాల్పులు జరిపినట్టు సమాచారం.
 

PREV
click me!

Recommended Stories

PM Modi Visit Ethiopia: మోదీ కి గుర్రాలపై వచ్చి స్వాగతం స్వయంగా కారునడిపిన పీఎం| Asianet News Telugu
PM Narendra Modi: దేశం గర్వపడేలా.. సౌదీ రాజులు దిగివచ్చి మోదీకి స్వాగతం| Asianet News Telugu