
సూరత్ : సస్పెండ్ చేయబడిన బిజెపి నేత నుపుర్ శర్మ ఫోటోను ఒక వ్యాపారవేత్త ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేశాడు. దీంతో అతడికి ముగ్గురు వ్యక్తులనుంచి బెదిరింపులు ఎదురయ్యాయి. వీరిని గుజరాత్‌లోని సూరత్ లో శుక్రవారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఫిర్యాదుదారుడైన వ్యాపారవేత్త అమ్యూజ్‌మెంట్ పార్క్ ను నడుపుతున్నాడు. అతను నూపుర్ శర్మ ఫోటోను పార్క్ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో అప్‌లోడ్ చేశాడు. దీని తర్వాత ఏడుగురు వ్యక్తుల నుండి చంపేస్తానని బెదిరింపులు ఎదుర్కొన్నాడని ఒక అధికారి తెలిపారు.
వీరిలో ముగ్గురిని అరెస్ట్ చేశామని, మరో నలుగురు నిందితుల కోసం అన్వేషణ కొనసాగుతోందని కేసు నమోదు చేసిన ఉమ్రా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ జేఆర్ చౌదరి తెలిపారు. అరెస్టయిన వ్యక్తులను మహ్మద్ అయాన్ అటాష్‌బాజివాలా, రషీద్ భురా, అలియా మహ్మద్ అనే మహిళ ఉన్నారు. వీరందరూ అందరూ సూరత్ నివాసితులుగా గుర్తించారు.
నూపుర్ శర్మకు ఫేస్ బుక్ లో మద్దతు.. యువకుడిపై 20 మంది దాడి.. బీహార్ లో ఘటన
ఈ ముగ్గురిపై భారతీయ శిక్షాస్మృతి సెక్షన్లు 504 (శాంతి భంగం కలిగించే ఉద్దేశంతో అవమానించడం), 506, 507 (నేరపూరిత బెదిరింపు) కింద అభియోగాలు మోపారు. అప్పటి బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ గత నెలలో టీవీ చర్చలో ప్రవక్త మహమ్మద్ గురించి వివాదాస్పద వ్యాఖ్య చేసింది. దీంతో దేశవ్యాప్తంగా పెద్ద దుమారాన్ని రేపింది.ఫిర్యాదుదారు ప్రకారం, అమ్యూజ్‌మెంట్ పార్క్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో నూపుర్ శర్మ ఫొటోను ఆ పార్క్ సోషల్ మీడియా మార్కెటింగ్‌ను నిర్వహించే వ్యక్తులు అప్‌లోడ్ చేశారు. అయితే, ఇది గమనించిన అతను వెంటనే ఫోటోను తొలగించి, క్షమాపణలు చెప్పాడు,
అయితే అరెస్టు అయిన ముగ్గురితో పాటు మరో నలుగురు ఇన్‌స్టాగ్రామ్‌లో అతనికి చంపుతామని బెదిరింపులు జారీ చేశారు. అంతేకాదు సూరత్‌లో ఉండాలనుకుంటాన్నావా?లేదా? అని కూడా బెదిరించారని ప్రాథమిక విచారణలో తేలింది. ఈ నెల ప్రారంభంలో, అహ్మదాబాద్‌కు చెందిన ఒక న్యాయవాది నూపుర్ శర్మకు మద్దతు ఇస్తూ వాట్సాప్ స్టేటస్ పెడితే అతనికి ఇలాంటి హత్య బెదిరింపు మెసేజ్ లు రావడంతో పోలీసులను ఆశ్రయించారు.