మైనర్ బాలిక మీద భర్త అత్యాచారం.. వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసిన భార్య..

Published : Jul 16, 2022, 11:39 AM IST
మైనర్ బాలిక మీద భర్త అత్యాచారం.. వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసిన భార్య..

సారాంశం

ఓ టీనేజ్ బాలిక మీద భర్త అత్యాచారం చేస్తే దాన్నంతా భార్య వీడియో తీసింది. దాన్ని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసింది. దీంతో విషయం వెలుగులోకి రావడంతో ఆ భార్యభర్తలిద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

ఉత్తరప్రదేశ్ : ఉత్తరప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంకా ఘోరమైన విషయం ఏమిటంటే.. ఈ దారుణాన్ని  అతని భార్య వీడియో తీసింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసింది. ఈ మేరకు పోలీసులు శుక్రవారం వెల్లడించారు. అంతేకాదు బాలిక ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామని, భార్యాభర్తలిద్దరినీ అరెస్ట్‌ చేశామని పోలీసులు తెలిపారు.

బాలిక చెప్పిన వివరాల మేరకు ఈ జంటను గురువారం అరెస్టు చేశామని, వారిమీద అత్యాచారం, లైంగిక నేరాల నుంచి పిల్లలకు రక్షణ (పోక్సో) చట్టం, ఐటీ చట్టం కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు ఫైజ్‌గంజ్ బెహతా పోలీస్ స్టేషన్ ఇంచార్జి చరణ్ సింగ్ రాణా తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జూలై 12న తన గ్రామానికి చెందిన వ్యక్తి తనను ఇంటికి పిలిచాడని బాలిక చెప్పింది. తాను వెళ్లగానే తనమీద అత్యాచారం చేశాడని, అతని భార్య తన మొబైల్ ఫోన్‌లో ఈ ఘటనను మొత్తం రికార్డ్ చేసిందని బాలిక తన ఫిర్యాదులో పేర్కొంది.

ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే వీడియోను ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేస్తానని భార్యాభర్తలు బాధితురాలిని బెదిరించారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. దీంతో భయపడి బాలిక విషయం ఎవ్వరికీ చెప్పలేదు. కానీ నిందితుడి భార్య వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో మైనర్ కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలిసింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ట్యాక్సీ డ్రైవర్ తో ప్రేమలో పడ్డ మహిళా టెకీ.. తీరా పెళ్లిచేసుకున్నాక తప్పు తెలుసుకుని....

ఇదిలా ఉండగా, జూలై 1న ఇలాంటి కేసులో నిందితుడికి త్రిపుర కోర్టు మరణశిక్ష విధించింది. నాలుగున్నరేళ్ల బాలికపై ఓ కామాంధుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆ చిన్నారి ఎవరికైనా చెబుతుందనుకున్నాడేమో కానీ హత్య చేశాడు. ఘటన వెలుగులోకి రావడంతో సదరు కీచకుడినిఅరెస్టు చేశారు. త్రిపురలోని ఖోవై జిల్లా కోర్టు అతనికి మరణశిక్ష విధించింది. జిల్లా కోర్టు, ప్రత్యేక పోక్సో చట్టం న్యాయమూర్తి శంకరి దాస్ ఈ తీర్పు వెలువరించారు. 

ఈ కేసు పూర్వాపరాలలోకి వెళితే… అగర్తలలోని ఖోవై జిల్లాలో ఈ దారుణ ఘటన జరిగింది. అక్కడ తెలియమురా ప్రాంతానికి చెందిన నాలుగున్నరేళ్లు బాలిక నిరుడు ఫిబ్రవరిలో ఇంటిముందు ఆడుకుంటుంది. అప్పటివరకు ఆడుకుంటున్న చిన్నారి.. కాసేపటికే కనిపించకుండా పోయింది. ఎంత వెతికినా ప్రయోజనం లేకపోయింది. అలా తప్పిపోయిన చిన్నారి... ఆరు రోజుల తర్వాత  ఒంటినిండా గాయాలతో విగతజీవిగా కనిపించింది.

దీంతో బాధిత బాలిక కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు, పోలీస్ స్టేషన్ లో వారి ఫిర్యాదు మేరకు  పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడు కాళీ చరణ్ త్రిపురగా గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అతని మీద అత్యాచారం, హత్య, సాక్ష్యాలను నాశనం చేయడం... సహా పలు కేసులు నమోదు చేశారు. ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసు ఇన్స్పెక్టర్ బిద్యేశ్వర్ సిన్హా తాజాగా నివేదికను, 35 మంది సాక్షుల వాంగ్మూలాలు కోర్టుకు సమర్పించారు. విచారణ తర్వాత నిందితుడు దోషిగా నిర్ధారించిన కోర్టు మరణ శిక్ష విధించింది. ఖోవై జిల్లాలో మరణశిక్ష విధించడం ఇదే తొలిసారి. 

PREV
click me!

Recommended Stories

Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు