శారద కేసు: దీదీకి షాక్, రాజీవ్‌ కుమార్‌ కస్టడీకి సుప్రీం గ్రీన్ సిగ్నల్

By Siva KodatiFirst Published May 17, 2019, 12:33 PM IST
Highlights

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శారదా చిట్‌ఫండ్ కేసులో కొత్త మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐపీఎస్, కోల్‌కతా మాజీ పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.

కేసు దర్యాప్తులో భాగంగా రాజీవ్ కుమార్‌ను కస్టడీలోకి తీసుకునేందుకు సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. ఆయన అరెస్ట్‌పై ఉన్న స్టేను ఎత్తివేస్తూ.. రాజీవ్‌ను విచారించేందుకు అత్యున్నత న్యాయస్ధానం సీబీఐకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.

ఒకవేళ ఆయన విచారణకు సహకరించకపోతే రాజీవ్‌ను అరెస్ట్ చేయవచ్చని సీబీఐకి సూచించింది. అయితే ముందస్తు బెయిల్ కోసం రాజీవ్ కుమార్‌ వారంలోపు పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు తెలిపింది.

శారదా చిట్ ఫండ్‌ కేసులో రాజీవ్‌ను విచారించేందుకు వచ్చిన సీబీఐ బృందాన్ని మమత ప్రభుత్వం అడ్డుకున్న సంగతి తెలిసిందే. శారదా గ్రూప్ పేరుతో 200 ప్రైవేట్ కంపెనీల నడిపిన పొంజీ స్కీం దివాళా తీయడంతో బెంగాల్‌తో పాటు చుట్టుపక్కల రాష్ట్రాల్లోని కోటి 70 లక్షల మంది డిపాజిటర్లు రోడ్డు మీద పడ్డారు.

click me!