
Covid 19 Death Compensation: కరోనా బాధితులకు అందించే.. నష్ట పరిహరం విషయంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్-19 బాధితుల బంధువులకు సరైనా సమయాన్ని పరిహారం చెల్లించేలా చూడాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది. ఈ విషయంలో న్యాయమూర్తులు MR షా, BV నాగరత్నలతో కూడిన ధర్మాసనం మాట్లాడుతూ.. ఎవరైనా అభ్యర్థులకు పరిహారం మొత్తాన్ని చెల్లించకపోవడం లేదా వారి అభ్యర్థతనను తిరస్కరించడంపై ఏదైనా ఫిర్యాదులు ఉంటే.. వారు సంబంధిత గ్రీవెన్స్ రిడ్రెసల్ కమిటీని సంప్రదించవచ్చు. నాలుగు వారాల్లోగా హక్కుదారుల దరఖాస్తుపై నిర్ణయం తీసుకోవాలని ఫిర్యాదుల పరిష్కార కమిటీని ధర్మాసనం ఆదేశించింది. రెండు రోజుల్లో SDRF ఖాతాకు బదిలీ చేయాలని బెంచ్ ఆదేశించింది.
ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (SDRF) ఖాతా నుండి వ్యక్తిగత డిపాజిట్ ఖాతాలకు డబ్బును బదిలీ చేయాలనీ, ఆరోపించిన పిటిషన్‌పై సంబంధిత నిధులను బదిలీ చేయాలని ఆదేశించింది. గతంలోని ఆర్డర్ ప్రకారం.. ఆలస్యం లేకుండా అర్హులైన వ్యక్తులకు పరిహారం చెల్లించేలా.. అన్ని రాష్ట్రాలను ఆదేశించడం ద్వారా పిటిషన్ విచారణను ముగించాము. ఎవరైనా హక్కుదారుకు ఏదైనా ఫిర్యాదు ఉంటే.. సంబంధిత ఫిర్యాదుల పరిష్కార కమిటీని సంప్రదించవచ్చని ధర్మాసనం తెలిపింది.
స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్‌డిఆర్‌ఎఫ్) నుండి వ్యక్తిగత డిపాజిట్ ఖాతాలకు డబ్బు బదిలీ చేయబడిందని ఆరోపిస్తూ.. దాఖలైన పిటిషన్‌పై తన ప్రత్యుత్తరాన్ని దాఖలు చేయడానికి సుప్రీంకోర్టు గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చివరి అవకాశం ఇచ్చింది. నగదు బదిలీ చేయకుండా ఆపడంపై రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టు నోటీసులు కూడా జారీ చేసింది.
పిటిషనర్ పల్లా శ్రీనివాసరావు తరఫు న్యాయవాది గౌరవ్ బన్సాల్ వాదిస్తూ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్‌డిఆర్‌ఎఫ్ ఖాతా నుండి వ్యక్తిగత డిపాజిట్ ఖాతాలకు డబ్బును బదిలీ చేసిందని, ఇది విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం చెల్లదని వాదించారు. విపత్తు నిర్వహణ చట్టం 2005లోని సెక్షన్ 46(2) కింద నిర్దేశించిన పనులకు కాకుండా ఇతర పనులకు రాష్ట్ర ప్రభుత్వం SDRF నిధులను అక్రమంగా ఉపయోగిస్తోందని బన్సల్ ఆరోపించారు.
కోవిడ్ నిధులు పక్కదారి పట్టడంపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా జస్టిస్ ఎంఆర్ షా ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. పీడీ ఖాతాలకు మళ్ళించిన కొవిడ్ నిధులను తిరిగి రెండు వారాల్లో ఎస్డీఆర్ఎఫ్ ఖాతాలోకి జమ చేయాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. పీడీ ఖాతాల్లోకి మళ్లించిన సుమారు 1,100 కోట్లను ఎస్‌డీఆర్‌ఎఫ్ ఖాతాలోకి జమ చేయాలని స్పష్టం చేసింది. అయితే నిధులు వెనక్కి ఇచ్చేందుకు సిద్దమని ఏపీ ప్రభుత్వం తరఫున న్యాయవాది సుప్రీం కోర్టుకు తెలియజేశారు.