పార్లమెంట్ ఉభయ సభల్లో విపక్షాల ఆందోళన: రేపటికి వాయిదా

Published : Jul 18, 2022, 02:47 PM IST
పార్లమెంట్ ఉభయ సభల్లో విపక్షాల ఆందోళన: రేపటికి వాయిదా

సారాంశం

పార్లమెంట్ ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. రాజ్యసభలో విపక్షాలు ఆందోళనకు దిగడంతో రాజ్యసభను రేపటికి వాయిదా వేస్తున్నట్టుగా రాజ్యసభ చైర్మెన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు. లోక్ సభ ప్రారంభమైన తర్వాత విపక్షాలు ఆందోళనకు దిగడంతో రేపటికి లోక్ సభను వాయిదా వేస్తున్నట్టుగా స్పీకర్ ప్రకటించారు.  

న్యూఢిల్లీ: Parliament ఉభయ సభలు రేపటికి వాయిదా వడ్డాయి. విపక్షాల ఆందోళనలతో పార్లమెంట్ ఉభయ సభలను వాయిదా వేశారు. 

సోమవారం నాడు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన తర్వాత పార్లమెంట్ ఉభయ సభల్లో విపక్షాలు ఆందోళనలకు దిగాయి. ద్రవ్యోల్బణం పెరుగుదల, కొన్ని వస్తువులకు GST పెంపు వంటి అంశాలపై రాజ్యసభలో విపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు ఆందోళనకు దిగారు.  విపక్ష పార్టీల ఎంపీల ఆందోళనతో రాజ్యసభను రేపటికి వాయిదా వేస్తున్నట్టుగా రాజ్యసభ చైర్మెన్ Venkaiah Naidu  ప్రకటించారు. రాజ్యసభ ప్రారంభం కాగానే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ దీపేందర్ సింగ్ హుడా అగ్నిపథ్ పై చర్చించేందుకు గాను బిజినెస్ ను సస్పెండ్ చేయాలని నోటీసు ఇచ్చారు. సీపీఎంకు చెందిన ఎంపీ కరీం కూడా నిత్యావసర సరుకులపై జీఎస్టీ పెంపు విషయమై చర్చను కోరుతూ నోటీసును ఇచ్చారు.

ధరల పెరుగుదల, జీఎస్టీ వంటి సమస్యలపై విపక్ష పార్టీల ఎంపీలు నినాదాలు చేయడంతో పాటు అంతరాయం కల్గించడంతో వర్షాకాల సమావేశాలు తొలి రోజున రాజ్యసభ కార్యకలాపాలు రేపటికి వాయిదా పడ్డాయి. 

అయితే Rajya Sabha ప్రారంభమైన తర్వాత ఇటీవల మరణించిన జపాన్ మాజీ ప్రధాని షింజో అబే, యూఏఈ మాజీ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ నహ్యాన్, ప్రముఖ హిందూస్థానీ శాస్త్రీయ సంగీత విధ్వాంసుడు  పండిట్ శివకుమార్ శర్మ తదితరుల మృతికి రాజ్యసభ సంతాపం తెలిపింది.  విపక్ష పార్టీల ఎంపీల ఆందోళనల నేపథ్యంలో రాజ్యసభను రేపటికి వాయిదా వేస్తున్నట్టుగా  రాజ్యసభ చైర్మెన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు.

Parliament  సమావేశాలు ప్రారంభమైన తర్వాత President  పోలింగ్ లో ఎంపీలు ఓటు హక్కును వినియోగించుకొనేందుకు గాను మధ్యాహ్నం రెండు గంటల వరకు Lok sabhaను  వాయిదా వేశారు. ఆ తర్వాత ప్రారంభమైన సమావేశాల్లో విపక్ష సభ్యులు ఆందోళనకు దిగడంతో సభను రేపటికి వాయిదా వేశారు. ఈ ఏడాది ఆగష్టు 12 వరకు పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ సెషన్  లో కేంద్రం  మొత్తం 32 బిల్లులను ప్రవేశ పెట్టనుంది. కంటోన్మెంట్ బిల్లు, మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సోసైటీస్ బిల్లులు ఉభయ సభల ముందు పెండింగ్ లో ఉన్నాయి. ఇదిలా ఉంటే పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఇంధన ధరలు, అగ్నిపథ్, నిరుద్యోగం, డాలర్ తో రూపాయి మారకం విలువ పతనం వంటి విషయాలను లేవనెత్తాలని విపక్షాలు భావిస్తున్నాయి.

PREV
click me!

Recommended Stories

PM Modi Visit Ethiopia: మోదీ కి గుర్రాలపై వచ్చి స్వాగతం స్వయంగా కారునడిపిన పీఎం| Asianet News Telugu
PM Narendra Modi: దేశం గర్వపడేలా.. సౌదీ రాజులు దిగివచ్చి మోదీకి స్వాగతం| Asianet News Telugu