ఈవీఎంలపై పార్టీ గుర్తులు వద్దు.. ఆ స్థానంలో అభ్యర్థుల విద్యార్హతలు, ఫొటోలు.. త్వరలో సుప్రీం కోర్టులో విచారణ

Published : Oct 29, 2022, 11:27 PM IST
ఈవీఎంలపై పార్టీ గుర్తులు వద్దు.. ఆ స్థానంలో అభ్యర్థుల విద్యార్హతలు, ఫొటోలు..  త్వరలో సుప్రీం కోర్టులో విచారణ

సారాంశం

ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం)లపై పార్టీ గుర్తుకు బదులు అభ్యర్థుల వయస్సు, విద్యార్హతలు, ఫొటోలతో కూడిన బ్యాలెట్ పేపర్ ను తీసుకవచ్చేలా  ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. అక్టోబర్ 31న సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో విడుదల చేసిన జాబితా ప్రకారం.. ఈ పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ ఎస్‌ఆర్ భట్, జస్టిస్ బేల ఎం. త్రివేదిలతో కూడిన ధర్మాసనం విచారించే అవకాశం ఉంది. న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిటిషన్‌లో..  ఈవీఎంలలో పార్టీ గుర్తును ఉపయోగించడం చట్టవిరుద్దమని, రాజ్యాంగ విరుద్ధమని కూడా పేర్కొనాలని పిటిషన్ లో  కోరారు

ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (ఈవీఎం)లపై, బ్యాలెట్‌ పత్రాల్లో పార్టీ గుర్తులను తొలగించి, వాటికి బదులు అభ్యర్థుల వయస్సు, విద్యార్హతలు, ఫొటోలను పెట్టేలా ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలని కోరుతూ పిటిషన్  దాఖలైంది. ఈ  పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది. ఇటువంటి చర్యతో ఓటర్లు తెలివైన, కష్టపడి పనిచేసే, నిజాయితీ గల అభ్యర్థులకు ఓటు వేసి ఎన్నుకునే అవకాశముంటుందని, అలాంటి అభ్యర్థులకు   మద్దతు ఇవ్వడానికి సహాయపడుతుందని పిటిషన్ లో పేర్కొన్నారు.

అలాగే..రాజకీయ పార్టీలు టికెట్ల పంపిణీలో ఏకపక్ష నిర్ణయం తీసుకోకుండా ఉందని పిటిషన్ లో పేర్కొన్నారు. కాగా, సుప్రీం కోర్టు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన అక్టోబర్ 31 నాటి కాజ్ లిస్ట్ ప్రకారం.. ఈ పిటిషన్ చీఫ్ జస్టిస్ యు యు లలిత్, జస్టిస్ ఎస్ ఆర్ భట్, బేల ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు వచ్చే అవకాశం ఉంది.ఈవీఎంలపై పార్టీ చిహ్నాలను ఉపయోగించడం చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధమని కూడా పేర్కొనాలని పిటిషన్ లో  కోరారు. ఇలా చేయడం రాజ్యాంగ ఉల్లంఘన అని ప్రకటించేలా ఆదేశాలు ఇవ్వాలని న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిటిషన్‌లో  కూడా పేర్కొన్నారు. 

న్యాయవాది అశ్వనీ కుమార్ దూబే దాఖలు చేసిన పిటిషన్‌లో రాజకీయాలలో అవినీతి, నేరాలను తగ్గించేందుకు ఉత్తమ పరిష్కారంగా బ్యాలెట్, ఈవీఎంలపై రాజకీయ పార్టీల చిహ్నాల స్థానంలో అభ్యర్థుల పేరు, వయస్సు, విద్యార్హతలు, అభ్యర్థి ఫోటోను పెట్టాలనేదే సరైన పరిష్కారమని తెలిపారు.

రాజకీయ పార్టీ గుర్తు లేకుండా బ్యాలెట్ ప్రతం,  EVM అనేక ప్రయోజనాలను కలిగి ఉన్నాయని, ఇది ఓటర్లు ఓటు వేయడానికి , తెలివైన, శ్రద్ధగల మరియు నిజాయితీ గల అభ్యర్థులకు మద్దతు ఇవ్వడానికి సహాయపడుతుందని పేర్కొంది. రాజకీయ పార్టీ గుర్తు లేకుండా బ్యాలెట్, ఈవీఎం టిక్కెట్ల పంపిణీలో రాజకీయ పార్టీల అధిపతుల నియంతృత్వాన్ని నియంత్రిస్తాయనీ, ప్రజల సంక్షేమం కోసం పనిచేసే వారికి టిక్కెట్లు ఇవ్వాలని పార్టీలు కూడా అభిప్రాయపడుతాయని అభ్యర్ధనలో పేర్కొన్నారు.

ఎన్నికల సంస్కరణల్లో పనిచేస్తున్న ప్రభుత్వేతర సంస్థ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) చేసిన అధ్యయనాన్ని ప్రస్తావిస్తూ.. 539 మంది ఎంపీలలో 233 మంది (43 శాతం)పై క్రిమినల్ కేసులు ఉన్నాయని పిటిషన్ దారు పేర్కొన్నారు.  

2014 ఎన్నికల తర్వాత విశ్లేషించిన 542 మంది విజేతల్లో 185 మంది (34 శాతం)పై క్రిమినల్ కేసులు ఉన్నాయనీ, 2009 లోక్‌సభ ఎన్నికల తర్వాత విశ్లేషించిన 543 మంది విజేతల్లో 162 మంది (30 శాతం)పై క్రిమినల్ కేసులు ఉన్నాయనీ పిటిషన్ దారు పేర్కొన్నారు. 2009 నుంచి  క్రిమినల్ కేసులు ఉన్న అభ్యర్థుల సంఖ్య పెరిగింది. లోక్‌సభ ఎంపీల్లో దాదాపు 44 శాతం మందిపై క్రిమినల్ కేసులున్నాయనీ, రానున్న రోజుల్లో ఆ సంఖ్య పెరిగే అవకాశముందన్న పిటిషన్ దారు ఆందోళన వ్యక్తం చేశారు.

PREV
click me!

Recommended Stories

Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు