Nupur Sharma: నుపుర్ శర్మపై సుప్రీం సీరియస్.. ‘వెంటనే టీవీలో దేశానికి క్షమాపణలు చెప్పాల్సింది’

Published : Jul 01, 2022, 12:57 PM IST
Nupur Sharma: నుపుర్ శర్మపై సుప్రీం సీరియస్.. ‘వెంటనే టీవీలో దేశానికి క్షమాపణలు చెప్పాల్సింది’

సారాంశం

నుపుర్ శర్మపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఆమె ఆ వ్యాఖ్యలు చేసిన వెంటనే టీవీలో దేశానికి క్షమాపణలు చెప్పాల్సిందని పేర్కొంది. ఆమె తన వ్యాఖ్యలనూ ఆలస్యంగానే ఉపసంహరించుకుందని తెలిపింది. ఆమెకు ముప్పు ఉన్నదా? లేక ఆమెనే ఓ సెక్యూరిటీ త్రెట్‌గా మారిందా? అని ప్రశ్నించింది. పలురాష్ట్రాల్లో తనపై నమోదైన కేసులను ఢిల్లీకి బదిలీ చేయాలని కోరుతూ ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.

న్యూఢిల్లీ: ఓ టీవీ డిబేట్‌లో మొహమ్మద్ ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి ప్రపంచవ్యాప్త ఆందోళనలకు కారణమైన సస్పెండెడ్ బీజేపీ నేత నుపుర్ శర్మపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఈ వ్యాఖ్యలు చీప్ పబ్లిసిటీ కోసం లేదా ఓ పొలిటికల్ అజెండా కోసం లేదా నీచమైన కార్యాల కోసం ఈ కామెంట్లు చేసినట్టుగా ఉన్నదని మండిపడింది. ఈ వ్యాఖ్యల కారణంగా పలు రాష్ట్రాల్లో ఆమెపై కేసులు నమోదయ్యాయి. ఆ కేసులన్నింటినీ దర్యాప్తు కోసం ఢిల్లీకి బదిలీ చేయాలని ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నుపుర్ శర్మకు ప్రాణ హాని ఉన్నదని చెప్పగా, ఆమెకు ముప్పు ఉన్నదా? లేక ఆమెనే ఓ సెక్యూరిటీ ముప్పును కలుగజేసిందా? అని ప్రశ్నించింది. నుపుర్ శర్మ దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది. హైకోర్టును ఆశ్రయించి ఈ అప్పీల్ చేయాలని సూచించింది. ఇదే సందర్భంగా నుపుర్ శర్మపై ఆగ్రహంగా వ్యాఖ్యలు చేసింది.

ఆమె నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించడం, ఆమె పిటిషన్ చూస్తుంటే.. తాను హాజరుకావడానికి మెజిస్ట్రేట్ కోర్టులు సరితూగవనే ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తున్నదని బెంచ్ సీరియస్ అయింది. ఒక పార్టీ ప్రతినిధి ఇలాంటి వ్యాఖ్యలు చేయవచ్చునా? తాను పార్టీ స్పోక్స్‌పర్సన్ కాబట్టి ఎలాంటి వ్యాఖ్యలు చేసినా చెల్లుబాటు అవుతుందనే అధికార అహం తలకు పట్టిందని పేర్కొంది. తాను చట్టాలకు అతీతంగా వ్యవహరించవచ్చనేలా ఆమె వ్యవహరించిందని వివరించింది. తనను రెచ్చగొట్టిన వారిపై ఎందుకు ఆమె కేసులు పెట్టలేదని అడిగింది. 

నుపుర్ శర్మ దర్యాప్తులో పాల్గొంటున్నదని, విచారణ నుంచి దూరంగా పరుగెట్టడం లేదని ఆమె తరఫు వాదిస్తున్న సీనియర్ అడ్వకేట్ మహిందర్ సింగ్ కోర్టుకు తెలిపారు. అయితే, ఆమెకు రెడ్ కార్పెట్ పరచాల్సిందేమో అని సుప్రీంకోర్టు పేర్కొంది.

నుపుర్ శర్మ తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పిందని, ఆమె వ్యాఖ్యలనూ వెనక్కి తీసుకుందని న్యాయవాది వివరించారు. దీనిపై స్పందిస్తూ.. ఆమె వెంటనే టీవీలో దేశానికి క్షమాపణలు చెప్పాల్సిందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఆమె తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవడంలో ఆలస్యం చేసిందని వివరించింది. వీరు రిలీజియస్ పీపుల్స్ కాదని, వారు రెచ్చగొట్టడానికి మాత్రమే వ్యాఖ్యలు చేస్తారని ఆగ్రహించింది.

ఆమె ఎలాంటి సందర్భంలో ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందో అడ్వకేట్ మహిందర్ సింగ్ కోర్టుకు వివరించే ప్రయత్నం చేశారు. కాగా, ప్రజాస్వామ్యంలో అందరికీ హక్కులు ఉంటాయని, అలాగని, ఏది మాట్లాడినా చెల్లుబాటు అవుతుందని అనుకోరాదని సుప్రీంకోర్టు హితవు పలికింది. తాము చేస్తున్న వ్యాఖ్యలపై నియంత్రణతో ఉండాలని పేర్కొంది.

ప్రస్తుతం నుపుర్ శర్మకు ప్రాణ హాని ఉన్నదని అడ్వకేట్ తెలుపగా.. ఆమెకు ముప్పు ఉన్నదా? లేక ఆమెనే ఒక సెక్యూరిటీ ముప్పుగా మారిందా? అని ప్రశ్నించింది. ఆమె చేసిన వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా ఉద్వేగాలు వెలువడ్డాయని వివరించింది. దేశంలో జరుగుతున్న పరిణామాలకు ఆమెనే ఏకైక బాధ్యురాలిగా చెప్పొచ్చని తెలిపింది. 

ఇటీవలే ఓ హిందూ షాప్‌కీపర్‌ హత్యనూ సుప్రీంకోర్టు పేర్కొంది. రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌కు చెందిన ఓ వ్యక్తి నుపుర్ శర్మ వ్యాఖ్యలను సమర్థిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ఈ పోస్టు కారణంగా ఆయన దారుణ హత్యకు గురయ్యాడు. ఉదయ్‌పూర్‌లో జరిగిన దురదృష్టకర హత్యా ఘటనకు నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలే కారణమని సుప్రీంకోర్టు తెలిపింది.

PREV
click me!

Recommended Stories

PM Modi Visit Ethiopia: మోదీ కి గుర్రాలపై వచ్చి స్వాగతం స్వయంగా కారునడిపిన పీఎం| Asianet News Telugu
PM Narendra Modi: దేశం గర్వపడేలా.. సౌదీ రాజులు దిగివచ్చి మోదీకి స్వాగతం| Asianet News Telugu