ప్రైవేట్ ఆస్తుల విషయంలో ఆసక్తికర కామెంట్స్ చేసిన సుప్రీంకోర్టు

By Arun Kumar P  |  First Published Nov 5, 2024, 11:57 AM IST

ఆస్తుల విషయంతో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆసక్తికరమైన తీర్పు ఇచ్చింది. 


భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఆసక్తికర తీర్పు ఇచ్చింది. ఒక వ్యక్తికి చెందిన ప్రైవేట్ ఆస్తి వనరులను సమాజానికి సంబంధించిన మెటీరియల్ రిసోర్స్‌గా పరిగణించలేమని ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని తొమ్మిది మంది న్యాయమూర్తుల బెంచ్ వ్యాఖ్యానించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 39(బి) ని పరిగణలోకి తీసుకుని సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ మేరకు తీర్పు చెప్పింది.

ప్రైవేట్ ఆస్తులను ప్రజా ప్రయోజనాల కోసం, సహజ వనరులుగా పేర్కొంటూ స్వాధీనం చేసుకోవచ్చా? లేదా? అన్నదానిపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ప్రైవేట్ యాజమాన్యంలోని అన్ని ఆస్తులను ఉమ్మడి ప్రయోజనాల కోసం ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి వీలు లేదని న్యాయస్థానం తేల్చింది. ఈ మేరకు 9 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తుల బెంచ్ 8:1 మెజారిటీతో తీర్పు ఇచ్చింది. 

Latest Videos

ప్రైవేట్ ఆస్తి సమాజం యొక్క మెటీరియల్ రిసోర్స్ గా ఏర్పడవచ్చు... కానీ ఒక వ్యక్తికి చెందిన ప్రతి వనరు సంఘం యొక్క భౌతిక వనరుగా పేర్కొంటూ స్వాధీనం చేసుకుంటామంటే కుదరదని రాజ్యాంగ ధర్మాసనం మూడు భాగాల తీర్పులో పేర్కొంది.

click me!