యోగి ఆదిత్యనాథ్ సర్కార్ యూపీలో పర్యాటకాన్ని ప్రోత్సహించి ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. ప్రయాగరాజ్ మహా కుంభమేళాలో ద్వారా కూడా వేలాదిమందికి మంచి ఉపాధి దక్కనుంది.
ప్రయాగరాజ్ : యోగి సర్కార్ సంప్రదాయ భారతీయ విలువలను పాాటిస్తూ 'అతిథి దేవో భవ' అనే భావనతో పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు, వాతావరణం కల్పిస్తోంది. ఇలా ప్రభుత్వ ప్రయత్నాల వల్ల రాష్ట్రంలో పర్యాటక రంగం సరికొత్త రూపుదిద్దుకుంటోంది. ప్రయాగరాజ్ మహాకుంభ్ లాంటి భారీ జన సమ్మేళనం దీనికి గొప్ప వేదికగా నిలుస్తోంది. పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ప్రయాగరాజ్ అంతటా వివిధ శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
మహా కుంభమేళా సమయంలో చిరు వ్యాపారులు మంచి ఆదాయం పొందవచ్చు. కుంభమేళాలో 45 వేలకు పైగా కుటుంబాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. అన్ని మతపరమైన పర్యాటక ప్రదేశాల చుట్టూ కూడా కొత్త ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.
undefined
2017 ముందు నిర్లక్ష్యానికి గురైన పర్యాటక రంగానికి యోగి సర్కార్ కొత్త ఊపునిచ్చింది. నవంబర్ 16, 2022న ఉత్తరప్రదేశ్ కొత్త పర్యాటక విధానం-2022 ఆమోదం పొందిన తర్వాత ఈ రంగం అభివృద్ధికి బాటలు పడ్డాయి. కొత్త పర్యాటక విధానంతో రాష్ట్రంలో 20 వేల కోట్ల పెట్టుబడులు, 10 లక్షల మందికి ఉపాధి లక్ష్యంగా పెట్టుకున్నారు. ముఖ్యంగా పర్యాటక రంగంలోని ప్రజలతో ప్రత్యక్షంగా సంబంధం కలిగినవారు (వ్యాపారులు, గైడ్స్ వంటివారు) నైపుణ్య శిక్షణ, నిర్వహణ కీలకం. ప్రయాగరాజ్ మహాకుంభమేళా దీనికి గొప్ప వేదికగా నిలుస్తోంది.
ప్రయాగరాజ్ ప్రాంతీయ పర్యాటక అధికారి అపరాజిత సింగ్ మాట్లాడుతూ... మహా కుంభమేళాలో పర్యాటకులతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉండేవారికి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించామన్నారు. నావికులు, టూర్ గైడ్‌లు, వీధి వ్యాపారులకు నైపుణ్య శిక్షణ, నిర్వహణ శిక్షణ ఇస్తున్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని మతపరమైన ప్రదేశాల్లో నదుల్లో పడవలు నడుపుకుంటూ జీవనం సాగించే నావికుల ఆదాయం పెంచడానికి, వారి సామర్థ్యాలు పెంపొందించడానికి యోగి సర్కార్ వారికి కొత్త పాత్ర కల్పిస్తోంది. పర్యాటక శాఖ 2000 మంది నావికులకు శిక్షణ ఇస్తోంది.
పర్యాటక శాఖ కాన్షీరామ్ పర్యాటక నిర్వహణ సంస్థ, మరో సంస్థతో ఒప్పందం కుదుర్చుకుందని... దీనిలో భాగంగా ఇప్పటివరకు 300 మంది నావికులకు నైపుణ్య శిక్షణ ఇచ్చినట్లు ప్రాంతీయ పర్యాటక అధికారి అపరాజిత సింగ్ తెలిపారు. ఈ శిక్షణతో నావికులు ఇకపై నది గైడ్‌లుగా వ్యవహరిస్తారు. దీంతో నదుల్లో పడవలు నడిపే వేలాది మంది నావికులకు ఉపాధి లభిస్తుంది... పర్యాటక ప్రదేశాల్లో వాతావరణం కూడా మెరుగుపడుతుందని ఆమె తెలిపారు.
పర్యాటక ప్రదేశాల అభివృద్ది అంటే మౌలిక సదుపాయాలు కల్పించడమే కాదు మెరుగైన సేవలు అందించడం కూడా. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రయాగరాజ్‌లో 1000 మంది టూర్ గైడ్‌లకు నైపుణ్య శిక్షణ, నిర్వహణ శిక్షణ ఇస్తున్నారు. కాన్షీరామ్ పర్యాటక నిర్వహణ సంస్థ, లక్నో అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రఖర్ తివారీ ఆధ్వర్యంలో ఈ శిక్షణ కార్యక్రమం జరుగుతోంది. ప్రఖర్ తివారీ మాట్లాడుతూ... ఇప్పటివరకు టూర్ గైడ్‌లకు 7 బ్యాచ్‌ల శిక్షణ పూర్తయిందని, 420 మంది టూర్ గైడ్‌లు శిక్షణ పొంది సేవలందించడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
పర్యాటకులకు నాణ్యమైన సేవలు అందించడానికి పర్యాటక రంగంలో శిక్షణ పొందిన వ్యక్తులను సిద్ధం చేయడం చాలా అవసరం. మహా కుంభమేళాకు వచ్చే పర్యాటకులకు ఆతిథ్యం ఇవ్వడంలో వీరు ఉపయోగపడతారు.
ప్రయాగరాజ్ ప్రాంతీయ పర్యాటక అధికారి అపరాజిత సింగ్ మాట్లాడుతూ.. మహా కుంభమేళాకు ముందు పర్యాటక రంగంలోని సేవా ప్రదాతలందరికీ, టూర్ గైడ్‌లు, నావికులతో పాటు వీధి వ్యాపారులు, టాక్సీ డ్రైవర్లకు కూడా శిక్షణ ఇస్తున్నామన్నారు. వీధి వ్యాపారులు పట్టణ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తారు. వారు స్థానికులకు నిత్యావసర వస్తువులు అందిస్తారు. బయటి నుంచి వచ్చే పర్యాటకులతో కూడా వారికి సంబంధం ఉంటుంది.
కాబట్టి పర్యాటకులతో ఎలా వ్యవహరించాలో, పర్యాటక ప్రదేశాలు, మార్గాల్లో పరిశుభ్రత గురించి వారికి శిక్షణ ఇవ్వడం అవసరం. పర్యాటక శాఖ దీనిపై దృష్టి పెట్టింది. ప్రయాగరాజ్‌లో 600 మంది వీధి వ్యాపారులు, 600 మంది టాక్సీ డ్రైవర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. ఇప్పటివరకు 250 మంది వీధి వ్యాపారులు, 120 మంది టాక్సీ డ్రైవర్లకు శిక్షణ ఇచ్చారు.
యోగి సర్కార్ కొత్త పర్యాటక విధానం పర్యాటక రంగానికి కొత్త ఊపునిస్తోంది, ఉపాధి అవకాశాలు పెంచుతోంది. ప్రయాగరాజ్‌లో మహాకుంభ్ ముందు పర్యాటక రంగంలోని సేవా ప్రదాతలకు నైపుణ్య శిక్షణ, నిర్వహణ శిక్షణ ఇవ్వడం వల్ల చాలా మంది యువతకు ఉపాధి లభిస్తుంది. వారి ఆదాయం పెరుగుతుంది. ప్రాంతీయ పర్యాటక అధికారి ప్రకారం, మహాకుంభ్ ముందు ఈ శిక్షణా కార్యక్రమం ద్వారా 45 వేలకు పైగా కుటుంబాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. అంతేకాకుండా ఈ మతపరమైన పర్యాటక ప్రదేశాల చుట్టూ కూడా కొత్త ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.