నిర్భయ దోషులకు ఉరి ఖాయం... క్యూరేటివ్ పిటిషన్ కొట్టివేత

By telugu teamFirst Published Jan 14, 2020, 2:23 PM IST
Highlights

వినయ్ శర్మ, ముఖేష్ కుమార్ ల తరపు న్యాయవాది సుప్రీం కోర్టులో క్యూరేటివ్ పిటిషన్లు దాఖలు  చేశారు.ఈ క్రమంలో మంగళవారం జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారించి... వారి పిటిషన్ ని కొట్టివేసింది. 
 

నిర్భయ దోషులకు సుప్రీం కోర్టు షాకిచ్చింది. వారు సుప్రీం కోర్టులో పెట్టుకున్న క్యూరేటివ్ పిటిషన్ ని న్యాయస్థానం కొట్టివేసింది. దోషులు మేఖేష్, వినయ్ శర్మలు పెట్టుకున్న క్షమాభిక్షను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ క్రమంలో  ఈ నెల 22వ తేదీన వారిని ఉరితీయడం ఖాయమని స్పష్టమైంది.

ఏడేళ్ల క్రితం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన  నిర్భయ ఉదంతంలో దోషులైన ముఖేష్ సింగ్(32), పవన్ గుప్తా(25), వినయ్ శర్మ(26), అక్షయ్ కుమార్ ఠాకూర్(31)లను ఈ నెల 22వ తేదీ ఉదయం 7గంటలకు తీహార్ జైలులో ఉరితీయాలని ఢిల్లీలోని పటియాలా హౌజ్ కోర్టు డెత్ వారెంట్లు  జారీ చేసింది. ఈ నేపథ్యంలో వినయ్ శర్మ, ముఖేష్ కుమార్ ల తరపు న్యాయవాది సుప్రీం కోర్టులో క్యూరేటివ్ పిటిషన్లు దాఖలు  చేశారు.ఈ క్రమంలో మంగళవారం జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారించి... వారి పిటిషన్ ని కొట్టివేసింది. 

Also Read వాళ్లకు ఉరి ఖాయం... అప్పుడే నా కూతురికి న్యాయం... నిర్భయ తల్లి

ఈ విషయంపై నిర్భయ తల్లి మీడియాతో మాట్లాడారు.   దోషులు సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారని చెప్పారు.  కానీ... అవి తిరస్కరణకు గురౌతాయని తానుభావిస్తున్నట్లు ఆమె చెప్పారు. జనవరి 22వ తేదీన వారిని ఉరితీయడం ఖాయమని వారు చెప్పారు.  వారికి ఉరితీసిన రోజే తన కూతురికి న్యాయం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. ఆమె ఆశించినట్లుగానే... క్యూరేటివ్ పిటిషన్ ని కొట్టివేశారు. 

click me!