అత్యాచారం చేసిన వ్యక్తితో పెళ్లి చేయండి.. యువతి వినతి..!

By telugu news teamFirst Published Aug 3, 2021, 7:40 AM IST
Highlights

విచారణ జరిపిన కోర్టు ఆయనకు 20ఏళ్ల శిక్ష విధించడంతో ప్రస్తుతం జైల్లోనే ఉన్నాడు. శిశువు జన్మించిన విషయాన్ని దాచి పెట్టి.. నేరాన్ని పోలీసుల దృష్టికి తీసుకురానందుకు ఆస్పత్రి నిర్వాహకులు, ఇద్దరు వైద్యులపైనా పోక్సో చట్టం కింద కేసు నమోదైంది.

తనపై అత్యాచారం చేసిన వ్యక్తితో తనకు పెళ్లి జరిపించాలంటూ.. అందుకు అనుమతి ఇవ్వండి అంటూ ఓ యువతి కోర్టును ఆశ్రయించింది. కాగా.. ఆమె వినతిని సుప్రీం కోర్టు తిరస్కరించడం గమనార్హం.  ఈ విషయమై అంగీకారం తెలపకుండా కేరళ హైకోర్టు తీసుకున్న నిర్ణయమే తీసుకుందని.. దీంట్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని న్యాయస్థానం పేర్కొంది.

కొట్టియార్ కు చెందిన ఆ యువతి.. బాలిక గా ఉన్న సమయంలో.. రాబిన్ వడక్కుంచెరీ అనే క్యాథలిక్ క్రైస్తవ మతగురువుతో సంబంధాలు ఉండేవి. ఫలితంగా బాలునికి జన్మనిచ్చింది. అనంతరం తనపై అత్యాచారం చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఫోక్సో చట్టం కింద కేసు నమోదైైంది.

విచారణ జరిపిన కోర్టు ఆయనకు 20ఏళ్ల శిక్ష విధించడంతో ప్రస్తుతం జైల్లోనే ఉన్నాడు. శిశువు జన్మించిన విషయాన్ని దాచి పెట్టి.. నేరాన్ని పోలీసుల దృష్టికి తీసుకురానందుకు ఆస్పత్రి నిర్వాహకులు, ఇద్దరు వైద్యులపైనా పోక్సో చట్టం కింద కేసు నమోదైంది.

బాలికపై జరిగిన అత్యాచారానికి సంబంధించిన సాక్ష్యాలను ధ్వంసం చేశారన్న అభియోగం కూడా మోపారు. ఈ నేపథ్యంలో బాలునికి నాలుగేళ్ల వయసు రావడంతో.. ఆయన తండ్రి రాబినే అని చెప్పుుకునేందుకు వీలుగా వివాహం చేసుకుంటానంటూ హైకోర్టు ఆశ్రయించింది. ఇందుకోసం రెండు నెలలపాటు జైలు నుంచి విడుదల చేయాలని కోరింది. రాబిన్ కూడా ఇదే తరహా విగ్నప్తి చేయడం గమనార్హం.

వీటిని హైకోర్టు తిరస్కరించింది.  సంఘటన జరిగిన సమయంలో ఆ మహిళ బాలిక అని తేలిందని.. ఈ తీర్పు  చేసిన అప్పీలు కూడా పరిశీలనలో ఉందని తెలిపింది. కింది కోర్టు ఇచ్చిన తీర్పు ఇంకా అమల్లోనే ఉన్నందున.. వివాహానికి అనుమతి ఇవ్వలేమని పేర్కొంది.

అలా అనుమతి ఇవ్వడం అంటే వివాహానికి కోర్టు ముద్ర పడినట్లేనని స్పష్టం చేసింది. దీనిపై సుప్రీం కోర్టులో అప్పీలు చేశారు. రాబిన్ తరపున న్యాయవాది అమిత్ జార్జ్ వాదనలు వినిపిస్తూ వివాహం ప్రాథమిక హక్కు అని.. దీనిని క్షుణ్ణంగా పరిశీలించకుండానే హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని తెలిపారు.

దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ఇద్దరి వయసు ఎంత అని అడిగింది. రాబిన్ కు 49ఏళ్లు.. ఆ మహిళకు 25ఏళ్లు అని సమాధానం ఇచ్చారు. దీనిని పరిశీలించకుండానే ఉత్తర్వులు ఇవ్వాలని కోరుకుంటున్నారా..? హైకోర్టు నిర్ణయంలో జోక్యం చేసుకోమని సుప్రీం తెలిపింది. 

మహిళ తరపున సీనియర్ న్యాయవాది కిరణ్ సూరి వాదిస్తూ ఆ బాలునికి చట్టబద్ధ హక్కులు కలిగించడానికే ఆమె  ప్రయత్నిస్తోందన్నారు. దాంతో ఈ కేసును తొలుత విచారించిన ట్రయల్ కోర్టునే మొదట ఆశ్రయించాల్సి ఉంటుందని ధర్మాసనం సూచించింది.

click me!