డెల్టా ప్లస్ వేరియంట్ మీద కోవాగ్జిన్ పనితీరు అద్భుతం.. ఐసీఎంఆర్ అధ్యయనం

By AN TeluguFirst Published Aug 2, 2021, 5:00 PM IST
Highlights

భారత్ లో కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతికి కారణంగా భావిస్తు్న డెల్టా వేరియంట్ నుంచి కొవాగ్జిన్ టీకా మెరుగైన రక్షణ కల్పిస్తోంది. దీంతోపాటు డెల్టా ప్లస్ వేరియంట్ ను కూడా ఈ వ్యాక్సిన్ సమర్థంగా ఎదుర్కొంటున్నట్లు అధ్యయనంలో తేలిందని ఐసీఎంఆర్ తెలిపింది. 

ఢిల్లీ : భారత్ బయోటెక్  అభివృద్ధి చేసిన ‘కొవాగ్జిన్’ టీకా డెల్టా ప్లస్ వేరియంట్ మీద సమర్థంగా పనిచేస్తోందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. దేశంలో కరోనా ఉద్ధృతి, వ్యాక్సిన్ల పనితీరు మీద భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) ఓ అధ్యయనం చేపట్టింది. 

భారత్ లో కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతికి కారణంగా భావిస్తు్న డెల్టా వేరియంట్ నుంచి కొవాగ్జిన్ టీకా మెరుగైన రక్షణ కల్పిస్తోంది. దీంతోపాటు డెల్టా ప్లస్ వేరియంట్ ను కూడా ఈ వ్యాక్సిన్ సమర్థంగా ఎదుర్కొంటున్నట్లు అధ్యయనంలో తేలిందని ఐసీఎంఆర్ తెలిపింది. 

కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు గానూ.. ఐసీఎంఆర్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ) సహకారంతో భారత్ బయోటిక్ ఈ టీకాను అభివృద్ధి చేసింది. ఈ టీకాకు 77.8శాతం సమర్థత ఉన్నట్లు ఇటీవల థార్డ్ వేవ్ క్లినికల్ ట్రయల్స్ తుది విశ్లేషణలో నిర్థారణ అయిన విషయం తెలిసిందే.

ఈ టీకా తీసుకుంటే ప్రాణాంతక కరోనా వైరస్ - డెల్టా వేరియంట్ నుంచి 65.2 శాతం రక్షణ ఉంటుందని తేలింది. తీవ్రమైన కోవిడ్ 19 రాకుండా 93.4 శాతం మేరకు నిరోధిస్తుందని, వ్యాధి సోకినప్పటికీ ఎటువంటి లక్షణాలు కనిపించని (అసింప్లమ్యాటిక్ కోవిడ్ 19) వారికి సైతం 63.6 శాతం మేర రక్షణ ఉంటుందని వెల్లడైంది. 
 
click me!