వంద శాతం కరోనా వ్యాక్సిన్ పంపిణీ: అరుదైన రికార్డు సాధించిన నగరమిదే

By narsimha lodeFirst Published Aug 2, 2021, 4:00 PM IST
Highlights


వంద శాతం వ్యాక్సిన్ అందించడంలో  భువనేశ్వర్ రికార్డు సాధించింది. 9 లక్షల మందికి  2 డోసుల వ్యాక్సిన్ అందించింది. ఈ విషయాన్ని భువనేశ్వర్ మున్సిపల్ అధికారులు  ప్రకటించారు.


భువనేశ్వర్: కరోనా వ్యాక్సిన్ పంపిణీలో ఒడిశా భువనేశ్వర్ పట్టణం అరుదైన రికార్డును స్వంతం చేసుకొంది. వంద శాతం లక్ష్యాన్ని చేరుకొంది.  నగరంలోని 18 ఏళ్లు దాటిన అర్హులైన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ రెండు డోసుల వ్యాక్సిన్ ను అందించింది.భువనేశ్వర్ లో 18 ఏళ్లకు పై బడిన వయస్సున్నవారు సుమారు 9 లక్షల మంది ఉన్నారు. వీరిలో  18.16 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్ డోసులు అందించినట్టుగా భువనేశ్వర్   మున్సిపల్ అధికారులు ప్రకటించారు. 

ఇతర ప్రాంతాల నుండి వచ్చిన  వలసకూలీలకు టీకాలు అందించినట్టుగా కూడ  అధికారులు తెలిపారు. టీకా పంపిణీలో లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్టుగా మున్సిపల్ అధికారులు చెప్పారు. నగర వ్యాప్తంగా 50 వ్యాక్సిన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టుగా చెప్పారు. ప్రజల సహకారంతో లక్ష్యాన్ని పూర్తి చేశామని అధికారులు వివరించారు.


 

click me!