కరోనా సమయంలో విడుదల చేసిన ఖైదీలంతా మళ్లీ జైలుకు రావాలి: 15 రోజులు గడువు ఇచ్చిన సుప్రీంకోర్టు

Published : Mar 24, 2023, 02:15 PM IST
కరోనా సమయంలో విడుదల చేసిన ఖైదీలంతా మళ్లీ జైలుకు రావాలి: 15 రోజులు గడువు ఇచ్చిన సుప్రీంకోర్టు

సారాంశం

కరోనా సమయంలో జైళ్ల నుంచి ఎమర్జెన్సీ బెయిల్ కింద విడుదల చేసిన దోషులు, విచారణ ఖైదీలను మళ్లీ సరెండర్ కావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అందుకు 15 రోజుల గడువు ఇచ్చింది.  

న్యూఢిల్లీ: కరోనా సమయంలో జైళ్లు ఖైదీలతో కిక్కిరిసి ఉండటం ప్రమాదకరం అని, తీవ్ర నేరాలు చేయని దోషులు, విచారణ ఖైదీలను విడుదల చేశారు. మహమ్మారి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. తాజాగా, సుప్రీంకోర్టు వీరిపై రియాక్ట్ అయింది. 15 రోజుల్లో అలా విడుదల చేసిన ఖైదీలంతా మళ్లీ జైళ్లకు వచ్చేయాలని ఆదేశించింది. జైలుకు వచ్చిన తర్వాత కావాలంటే బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.

జస్టిస్ ఎంఆర్ షా, సీటీ రవికుమార్‌ల ధర్మాసనం ఈ ఆదేశాలు ఇచ్చింది. కరోనా సమయంలో ఎమర్జెన్సీ బెయిల్ మీద విడుదల చేసిన విచారణ ఖైదీలు సరెండర్ కావాలని, జైలుకు వచ్చిన తర్వాత ఆయా కోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ధర్మాసనం వివరించింది. అలాగే, కరోనా సమయంలో విడుదలైన దోషులూ సరెండర్ అయిన తర్వాత తమ శిక్షను రద్దు చేయాలనే దరఖాస్తుతో సంబంధిత కోర్టును ఆశ్రయించవచ్చునని తెలిపింది. 

Also Read: ఢిల్లీ లిక్కర్ స్కాం: ఈడీ విచారణకు కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబు

సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏర్పడ్డ అత్యున్న కమిటీ సిఫారసుల మేరకు తీవ్ర నేరాలు చేయని ఖైదీలను, విచారణ ఖైదీలను కరోనా సమయంలో జైళ్ల నుంచి విడుదల చేశారు. ఇందులో దోషులు, విచారణ ఖైదీలు ఉన్నారు.

PREV
click me!

Recommended Stories

PM Modi Visit Ethiopia: మోదీ కి గుర్రాలపై వచ్చి స్వాగతం స్వయంగా కారునడిపిన పీఎం| Asianet News Telugu
PM Narendra Modi: దేశం గర్వపడేలా.. సౌదీ రాజులు దిగివచ్చి మోదీకి స్వాగతం| Asianet News Telugu