ఉన్నావ్ అత్యాచార, హత్య కేసు: సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం

By Nagaraju penumalaFirst Published Aug 1, 2019, 2:54 PM IST
Highlights

ఉన్నావ్ అత్యాచారం ఘటనకు సంబంధించిన అన్ని కేసులను ఉత్తర ప్రదేశ్ నుంచి ఢిల్లీకి బదిలీ చేయాలని ఆదేశించింది. అలాగే ఉన్నావ్ బాధితురాలి అత్యాచారం అనంతరం జరిగిన పరిణామాలపై సీబీఐ పూర్తి వివరాలు అందజేయాలని కోరింది.  
 

న్యూఢిల్లీ: ఉన్నావ్ అత్యాచార ఘటన, హత్యాయత్నం కేసులో సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం ప్రకటించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉన్నావ్ అత్యాచారం, హత్యాచార యత్నానికి సంబంధించి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ చేపట్టాలంటూ నిర్ణయం తీసుకుంది. 

ఉన్నావ్ అత్యాచారం ఘటనకు సంబంధించిన అన్ని కేసులను ఉత్తర ప్రదేశ్ నుంచి ఢిల్లీకి బదిలీ చేయాలని ఆదేశించింది. అలాగే ఉన్నావ్ బాధితురాలి అత్యాచారం అనంతరం జరిగిన పరిణామాలపై సీబీఐ పూర్తి వివరాలు అందజేయాలని కోరింది. 

ఈ నేపథ్యంలో సీబీఐ జాయింట్ డైరెక్టర్ సంపత్ మీనా కోర్టులో హాజరయ్యారు. ఈ సందర్భంగా సీబీఐకి పలు సూచనలు చేసింది. బాధితురాలికి సీఆర్పీఎఫ్ రక్షణ కల్పించాలని ఆదేశించింది.

45 రోజుల్లో కేసు విచారణ పూర్తి చేయాలని ఆదేశించింది. అలాగే హత్యాయత్నం కేసుకు సంబంధించి వారం రోజుల్లోగా చార్జిషీట్ దాఖలు చేయాలని సీబీఐను ఆదేశించింది. బాధితురాలు కుటుంబ సభ్యులు కోరితే ఢిల్లీలో ఆమెకు చికిత్స అందించాలని ఆదేశించింది. 

అత్యాచార బాధితురాలికి తక్షణమే రూ.25లక్షలు పరిహారం అందజేయాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఇకపోతే ఈ కేసును రాజీ చేసుకోవాలంటూ ప్రధాన నిందితుడు, బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ అనుచరుల నుంచి అత్యాచార బాధితురాలికి, ఆమె బంధువులకు బెదిరింపులు వస్తున్నాయని బాధితురాలి కుటుంబం సీజే దృష్టికి తీసుకెళ్లింది. బాధితురాలకి సీఆర్పీఎఫ్ భద్రత కల్పించాలని ఆదేశించింది. 

ఉన్నావ్ అత్యాచారం కేసుతో పాటు ఇటీవల బాధితురాలి కారును లారీ ఢీకొన్న ఘటనపైనా వివరాలు వారం రోజుల్లో సమర్పించాలని సీజే జస్టిస్ రంజన్ గొగోయ్ సీబీఐని ఆదేశించారు. అలాగే రెండు కేసులను 45 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించింది.  

ఈ వార్తలు కూడా చదవండి

ఉన్నావ్ బాధితురాలి కేసు: బీజేపీ ఎమ్మెల్యే కుల్ దీప్ సెంగార్ బహిష్కరణ

click me!