
విద్వేష వ్యాఖ్యల కేసులో అరెస్ట్ అయిన జర్నలిస్ట్ మహ్మద్ జుబేర్‌కు (Mohammed Zubair) ఊరట కలిగింది. ఆయనకు సుప్రీంకోర్ట్ (supreme court) బుధవారం బెయిల్ మంజూరు చేసింది. ఉత్తరప్రదేశ్‌లో నమోదైన ఆరు ఎఫ్ఐఆర్‌ల నుంచి అతనికి ఊరట లభించింది. జుబేర్‌ను బుధవారం సాయంత్రం ఆరు గంటల లోపు విడుదల చేయాలని ఉత్తరప్రదేశ్ పోలీసులను సుప్రీంకోర్ట్ ఆదేశించింది. సీతాపూర్, లఖీంపూర్ ఖేరీ, ఘజియాబాద్, ముజఫర్‌నగర్, హత్రజ్ జిల్లాల్లో నమోదైన ఆరు ఎఫ్ఐఆర్‌లను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టును అభ్యర్ధించారు జుబేర్.
జుబేర్‌పై 7 కేసులు
మత విద్వేషాలు రేపాడనే ఆరోపణలపై ఆల్ట్ న్యూస్ కో-ఎడిటర్ జుబేర్ పై దేశవ్యాప్తంగా 7 కేసులు నమోదయ్యాయి. వీటిలో 6 కేసులు ఉత్తరప్రదేశ్‌లోనే నమోదయ్యాయి, ఒక కేసు దేశ రాజధాని ఢిల్లీలో నమోదైంది. వీటిలో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ కేసుల్లో బెయిల్ పొందారు. ప్రస్తుతం 5 కేసుల్లో కస్టడీలో ఉండగా.. ఈ కారణంగా రెండు కేసుల్లో బెయిల్ మంజూరు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది.
ALso REad:Mohammad Zubair Bail Plea: మహ్మద్ జుబేర్ కు మరో ఎదురుదెబ్బ.. బెయిల్ పిటిషన్ తిరస్కరణ
నాలుగేళ్ల క్రితం ప్రముఖ హిందీ సినిమా స్క్రీన్‌షాట్‌ను షేర్ చేస్తూ చేసిన ట్వీట్‌పై మొహమ్మద్ జుబేర్‌ను జూన్ 27న ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం యూపీ పోలీస్‌లో అతనిపై నమోదైన కేసులో రిమాండ్‌కు తరలించారు. యూపీలో హత్రాస్, లఖింపూర్ ఖేరీ, ఘజియాబాద్, సీతాపూర్, ముజఫర్ నగర్‌లలో జుబైర్‌పై ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. వీటిలో నాలుగు కేసుల్లో అరెస్టయ్యాడు. వాటిలో ఢిల్లీ, సీతాపూర్, హత్రాస్ మరియు లఖింపూర్ ఖేరీ కేసులు ఉన్నాయి.
ఇదిలా ఉంటే.. ఉత్తరప్రదేశ్ పోలీసులు తనపై పెట్టిన ఆరు కేసులను రద్దు చేయాలని సుప్రీంకోర్టును అభ్యర్థించారు. కేసుల దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని రద్దు చేయాలని కోరారు. ఉత్తరప్రదేశ్ పోలీసులు అతనిపై అనేక కేసులను విచారించడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.