జస్టిస్ చంద్రచూడ్ నియామకాన్ని సవాలు చేస్తూ పిటిషన్.. కొట్టివేసిన సుప్రీం

Published : Nov 02, 2022, 02:52 PM IST
జస్టిస్ చంద్రచూడ్ నియామకాన్ని సవాలు చేస్తూ పిటిషన్.. కొట్టివేసిన సుప్రీం

సారాంశం

భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ప్రమాణస్వీకారం చేయకుండా నిరోధించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.ఈ పిటిషన్‌ను పరిశీలించేందుకు  ఎలాంటి కారణం చూపలేదని సుప్రీంకోర్టు పేర్కొంది.  

భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డివై చంద్రచూడ్ నియామకానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు బుధవారం కొట్టివేసింది . సీజేఐ యూయూ లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం..కొన్ని న్యాయపరమైన ఉత్తర్వులను ఉదహరిస్తూ..ప్రయోజనాల విరుద్ధమని ఆరోపించిన పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఈ పిటిషన్‌ను పరిశీలించేందుకు ఎలాంటి కారణం చూపలేదని పేర్కొంది. 

భారత 50వ ప్రధాన న్యాయమూర్తిగా  జస్టిస్ చంద్రచూడ్ నవంబర్ 9న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రస్తుత CJI UU లలిత్ అక్టోబర్ 11న జస్టిస్ చంద్రచూడ్ పేరును కేంద్రానికి తన వారసుడిగా సిఫార్సు చేశారు. ప్రమాణ స్వీకారం చేయకుండా అత్యంత సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్‌ను నిషేధించాలనే డిమాండ్ వచ్చింది. ప్రమాణ స్వీకారానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసింది. అంతకుముందు ఈ పిటిషన్‌ను బుధవారం నాడు విచారించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది.

జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఈ పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు.. పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకోవడానికి తమకు ఎటువంటి కారణం కనిపించడం లేదనీ, ఈ పిటిషన్ పూర్తిగా తప్పుదోవ పట్టించేలా ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రధాన న్యాయమూర్తి ఉదయ్ ఉమేష్ లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం మధ్యాహ్నం 1:45 గంటలకు ఈ వ్యాజ్యాన్ని విచారించింది. 

 ఈ పిటిషన్ ను కొట్టివేయడంతో నామినేట్ చేయబడిన భారత ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ భారతదేశ 50వ ప్రధాన న్యాయమూర్తిగా నవంబర్ 9న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జస్టిస్ చంద్రచూడ్ నవంబర్ 10, 2024 వరకు రెండు సంవత్సరాల పాటు CJIగా వ్యవహరిస్తారు. 

జస్టిస్ చంద్రచూడ్ నవంబర్ 11, 1959న జన్మించారు. అతను ముంబై ,ఢిల్లీలో పాఠశాల విద్యను అభ్యసించాడు. అతను ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుండి పట్టభద్రుడయ్యాడు. ఆ తర్వాత 1982లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ చేశారు. ఇక్కడ నుండి అతను US లోని హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి వెళ్ళాడు.అతను తన మొదటి LLM పూర్తి చేసాడు. ఆ తరువాత  1986లో జురిడికల్ సైన్సెస్‌లో PhD సంపాదించాడు.

డివై చంద్రచూడ్ తండ్రి 16వ ప్రధాన న్యాయమూర్తి

జస్టిస్ డివై చంద్రచూడ్ తండ్రి యశ్వంత్ విష్ణు చంద్రచూడ్ వైవి చంద్రచూడ్ దేశ 16వ ప్రధాన న్యాయమూర్తి. వై.వి.చంద్రచూడ్ 22 ఫిబ్రవరి 1978 నుండి 11 జూలై 1985 వరకు దాదాపు ఏడేళ్లు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి గా వ్యవహరించారు.ఇప్పటి వరకు సీజేఐకి ఇదే సుదీర్ఘ కాలం. తన తండ్రి పదవీ విరమణ చేసిన 37 ఏళ్ల తర్వాత ఆయన కుమారుడు జస్టిస్ డీవై చంద్రచూడ్ సీజేఐ కాబోతున్నారు. సుప్రీంకోర్టు చరిత్రలో తండ్రి తర్వాత కొడుకు కూడా సీజేఐ అవడం ఇదే తొలి సారి.  

కీలక తీర్పులు 

అయోధ్య,శబరిమల,సెక్షన్ 377ను నేరరహితం చేయడం మొదలైన అనేక కీలక తీర్పులలో జస్టిస్ చంద్రచూడ్ కీలకంగా వ్యవహరించారు.ఇటీవలి ల్యాండ్‌మార్క్ గా నిలిచిన అవివాహిత స్త్రీలను వైద్యపరంగా గర్భం తొలగించడాన్ని అనుమతించడం వంటి తీర్పుల్లో వెలువర్చడంతో కీలకంగా వ్యవహరించారు. 

చంద్రచూడ్ మార్చి 29, 2000 నుండి అక్టోబర్ 31, 2013 నుండి అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యే వరకు బొంబాయి హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు. దీనికి ముందు, అతను జూన్ 1998లో బాంబే హైకోర్టు ద్వారా సీనియర్ న్యాయవాదిగా నియమించబడ్డాడు. అదే సంవత్సరం న్యాయమూర్తిగా నియామకం అయ్యే వరకు అదనపు సొలిసిటర్ జనరల్ అయ్యాడు. 

నవంబర్ 8న సీజేఐ లలిత్ పదవీ విరమణ 
 
ప్రస్తుత సీజేఐ యూయూ లలిత్ పదవీకాలం 8 నవంబర్ 2022తో ముగుస్తుంది. ఆయన కేవలం 74 రోజులు మాత్రమే ఈ పదవిలో ఉంటారు. CJI NV రామన్ పదవీకాలం పూర్తయిన తర్వాత 26 ఆగస్టు 2022న జస్టిస్ లలిత్ దేశ 49వ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

ఆయన పదవీ కాలం కేవలం రెండున్నర నెలలు కాగా..  ఆయన మాజీ ప్రధాన న్యాయమూర్తుల సగటు పదవీకాలం 1.5 సంవత్సరాలు. జస్టిస్ చంద్రచూడ్ నవంబర్ 10, 2024న పదవీ విరమణ చేయనున్నారు. అంటే.ఆయన రెండున్నరేండ్లు దేశ ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించనున్నారు. 2016లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

PREV
click me!

Recommended Stories

Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?
Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?