రైతు రుణాల రీకవరి.. ముందు పెద్ద చేపల సంగతి చూడండి : బ్యాంకుల పిటిషన్ కొట్టేసిన సుప్రీం

By Siva KodatiFirst Published May 13, 2022, 6:22 PM IST
Highlights

రైతు రుణాల రీకవరికి సంబంధించి బ్యాంకులు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్ట్ కొట్టివేసింది. ముందు పెద్ద చేపలను పట్టుకుని ఆ తర్వాత రైతుల విషయంపై మాట్లాడాలని చురకలు వేశారు. 

రైతు రుణాల రీకవరి (farm loan recovery) విషయంలో సుప్రీంకోర్ట్ (supreme court) కీలక తీర్పు వెలువరించింది. రుణాల రీకవరీ విషయంలో బ్యాంకులు వేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. ముందు పెద్ద చేపలను పట్టుకున్న తర్వాత రైతులు జోలికి వెళ్లాలని బ్యాంకులకు సూచించారు జస్టిస్ డీవై చంద్రచూడ్ (justice dy chandrachud) . బ్యాంకులు వేసిన పిటిషన్‌పై జస్టిస్ చంద్రచూడ్  ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పిటిషన్ల కారణంగా రైతులు చితికి పోతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మధ్య రిలీజైన సర్కార్ వారి పాట (sarkaru vaari paata) సినిమా థీమ్ తరహాలో సుప్రీం ఆదేశాలు వున్నాయి. బ్యాంకులు  లోన్‌ల రీకవరి విషయంలో పేదలు, సామాన్యులు, సంపన్నులు, పలుకుబడి కలిగిన వ్యక్తుల మధ్య ఎలాంటి తేడాలతో వ్యవహరిస్తున్నాయనే విషయాన్ని ఈ సినిమాలో చూపించారు. ప్రస్తుతం సుప్రీం తీర్పు కూడా సర్కార్ వారి పాటకు దగ్గరగా వుండటం గమనార్హం. 

click me!