జమ్మూకాశ్మీర్‌లో విషాదం: కత్రా వద్ద యాత్రికుల బస్సులో మంటలు, నలుగురి మృతి.. భారీగా క్షతగాత్రులు

Siva Kodati |  
Published : May 13, 2022, 05:30 PM ISTUpdated : May 13, 2022, 06:04 PM IST
జమ్మూకాశ్మీర్‌లో విషాదం: కత్రా వద్ద యాత్రికుల బస్సులో మంటలు, నలుగురి మృతి.. భారీగా క్షతగాత్రులు

సారాంశం

జమ్మూకాశ్మీర్‌లోని కత్రా వద్ద యాత్రికుల బస్సులో అగ్ని ప్రమాదం  చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు సజీవ దహనం కాగా. దాదాపు 20 మందికి పైగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బందికి ఘటనా స్థలికి చేరుకున్నారు. 

జమ్మూకాశ్మీర్‌లో (jammu and kashmir) విషాదం చోటు చేసుకుంది. శుక్రవారం కత్రాలో (katra) యాత్రికులతో వెళ్తున్న బస్సులో మంటలు చెలరేగడంతో (fire accident) నలుగురు సజీవ దహనమవ్వగా.. 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. బస్సు కత్రా నుంచి జమ్మూకి వెళ్తుండగా కత్రాకు దాదాపు 1.5 కి.మీ దూరంలోని ఖర్ముల్ వద్ద ఈ ఘటన జరిగింది. ప్రాథమిక అంచనా ప్రకారం.. ఇంజిన్‌లో మంటలు రేగి , క్షణాల్లో అది బస్సు మొత్తాన్ని చుట్టుముట్టాయని తెలుస్తోంది. సమాచారం అందుకున్న సహాయక బృందాలు  ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం