రాఫెల్‌ డీల్‌: కేంద్రానికి సుప్రీం షాక్

Published : Apr 10, 2019, 10:55 AM ISTUpdated : Apr 10, 2019, 11:03 AM IST
రాఫెల్‌ డీల్‌: కేంద్రానికి సుప్రీం షాక్

సారాంశం

రాఫెల్ ఒప్పందంపై  కేంద్రానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.ఈ ఒప్పందం వివాదంలో దాఖలైన రివ్యూ పిటిషన్లను విచారిస్తామని సుప్రీంకోర్టు బుధవారం నాడు తేల్చి చెప్పింది.

న్యూఢిల్లీ:   రాఫెల్ ఒప్పందంపై  కేంద్రానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.ఈ ఒప్పందం వివాదంలో దాఖలైన రివ్యూ పిటిషన్లను విచారిస్తామని సుప్రీంకోర్టు బుధవారం నాడు తేల్చి చెప్పింది.

రివ్యూ పిటిషనర్లు దాఖలు చేసిన పత్రాల మెరిట్ ఆధారంగా కేసును విచారిస్తామని సుప్రీంకోర్టు ప్రకటించింది. ఈ ఒప్పందంపై కేంద్రం లేవనెత్తిన ప్రాథమిక అభ్యంతరాలను  సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.

త్వరలోనే విచారణ తేదీలను కూడ ప్రకటిస్తామని ఇవాళ సుప్రీం కోర్టు ప్రకటించింది. కేంద్రం తరపున అడ్వకేట్ జనరల్ వేణుగోపాల్ సుప్రీంలో వాదించారు. కేంద్రం తరపున పిటిషనర్ల వాదనలో పస లేదని ఆయన వాదించారు.

రాఫెల్ ఒప్పందంపై అరుణ్ శౌరి, ప్రశాంత్ భూషణ్‌లు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్లపై   విచారణ చేపట్టడం వల్ల దేశ భద్రతకు సంబంధించిన ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని వేణుగోపాల్ అభిప్రాయపడ్డారు. కేంద్రం అభ్యంతరాలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.

PREV
click me!

Recommended Stories

Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు